క్రికెటర్‌గా, కోచ్‌గా ముంబయి జట్టుకు సేవలందించిన కోచ్ వాసు పరంజేపే(82) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయమై సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు దిగ్గజ సచిన్ తెందూల్కర్.
ఆరు దశాబ్దాల కెరీర్లో ముంబయి క్రికెట్ అసోసియేషన్‌లో కోచ్, సెలెక్టర్, మెంటర్.. ఇలా అన్ని విధాలుగా ఎంతోమంది క్రికెటర్లు అండగా నిలిచారు. సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లకు మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తించి, వాళ్ల కెరీర్ ఎదుగుదలలో తోడ్డాటు అందించారు.
పరంజేపే కుమారుడు కూడా జాతీయ మాజీ సెలెక్టర్‌గా, క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇవీ చదవండి: