Sun Risers Hyderabad 2024 Squad : ఇటీవలే జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకెళ్లింది. దాదాపు రూ. 34 కోట్ల ప్రైజ్‌మనీతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆక్షన్ టీమ్ ఆ వేలంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి మంచి మంచి ప్లేయర్లను సొంతం చేసుకుంది.
ఇందులో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాక ఆసీస్ జట్టుకు చెందిన ట్రావిస్ హెడ్‌ను కూడా జట్టులోకి తీసుకుంది. ఇతడ్ని రూ. 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు వనిందు హసరంగను కోటిన్నరకు కొనుగోలు చేసింది. ఇదే టీమ్ కోసం దేశవాళీ ప్లేయర్లలో ఆకాశ్ సింగ్, జయదేవ్ ఉనాద్కత్, సుబ్రమణ్యన్‌లను కూడా తీసుకుంది.
ఇక టీమ్ కాంబినేషన్ విషయానికి వస్తే ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ బరిలోకి దింపనుంది. మిడిలార్డర్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, హెన్రీచ్ క్లాసెన్ క్రీజులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రాహుల్ త్రిపాఠి తన స్థాయికి తగ్గ ఫామ్ చూపిస్తే ఇక సన్‌రైజర్స్‌కు తిరుగుండదని విశ్లేషకుల మాట. అయితే మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఎక్స్‌ట్రా ఓవర్‌సీస్ పేసర్‌ను తీసుకోవాలనుకుంటే మార్క్‌రమ్, ట్రావిస్ హెడ్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.
ఆరోస్థానంలో బిగ్ హిట్టర్ అయిన అబ్దుల్ సమద్ లేకుంటే ఉపేంద్ర యాదవ్ ఈ ఇద్దరిలో ఒకరిని బరిలోకి దింపనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు షెహ్‌బాజ్ అహ్మద్ నుంచి గట్టి పోటీ ఉండనుంది. పేసర్లుగా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తమ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్కో జాన్సెన్‌ను తుది జట్టులోకి తీసుకుంటే నటరాజన్, ఉమ్రాన్ మాలిక్‌లో ఎవరో ఒకరు బెంచ్‌కే పరిమితం అవుతారు. ఇలా తుది జట్టు కాస్త ఆసక్తికగా ఎంపిక కానుందని ఇన్సైడ్ టాక్. చూడాలి అసలు జట్టు ఎప్పుడు అనౌన్స్ అవుతుందో ఇక!
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
మయాంక్ అగర్వాల్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్/షెహ్‌బాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్,అబ్దుల్ సమద్/ఉపేంద్ర యాదవ్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్
'SRHలో ఉండడం చాలా హ్యాపీ- నా కెరీర్లో ఇది కొత్త ఫేజ్'- ఈటీవీ భారత్‌తో జయదేవ్ ఉనద్కత్!
ఆల్‌టైమ్ రికార్డ్ ప్రైజ్- వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రాకతో SRHలో నయా జోష్