శ్రీలంక టాప్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య.. టెస్టు క్రికెట్‌లో ఓ నయా రికార్డును సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐర్లాండ్‌తో గాలె క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు. దీన్ని అతను 7 టెస్టు మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం. అంతకుమందు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది.
ఆల్ఫ్ వాలెంటైన్.. తన ఎనిమిదో టెస్టు మ్యాచ్‌ల్లోనే ఈ అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఆయన ఆ రికార్డును 1951-52 మధ్య కాలంలో నెలకొల్పాడు. దీంతో 71 ఏళ్ల తర్వాత తాజాగా.. ఆ ప్రపంచ రికార్డును ఈ లెఫ్టామ్ స్పిన్నర్ బద్దలుకొట్టాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్‌గా కూడా ప్రభాత్ రికార్డులకెక్కాడు.
అయితే ఇప్పటికీ మొదటి స్థానంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ చార్లీ టర్నర్ ఉన్నాడు. అతడు 1988లో ఇంగ్లండ్‌తో జరిగిన తన ఆరో టెస్టులోనే 50 వికెట్లు తీశాడు. మరో ఇంగ్లండ్ బౌలర్ థామస్ రిచర్డ్‌సన్ (1896), సౌతాఫ్రికా బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ (2012) కూడా తమ ఏడో టెస్టులోనే 50 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. అయితే వీళ్లిద్దరూ పేస్ బౌలర్లు.
-
Prabath Jayasuriya storms into the record books as the quickest 🏎️💨 Spinner and the quickest Sri Lankan to reach 50 Test wickets,🔥 joining the ranks of the second-fastest players in Test cricket history! 🏏🎉
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) April 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Jayasuriya hit the 50-wicket mark in just his seventh Test to snatch… pic.twitter.com/Jq6Ia2mZV0
">Prabath Jayasuriya storms into the record books as the quickest 🏎️💨 Spinner and the quickest Sri Lankan to reach 50 Test wickets,🔥 joining the ranks of the second-fastest players in Test cricket history! 🏏🎉
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) April 28, 2023
Jayasuriya hit the 50-wicket mark in just his seventh Test to snatch… pic.twitter.com/Jq6Ia2mZV0Prabath Jayasuriya storms into the record books as the quickest 🏎️💨 Spinner and the quickest Sri Lankan to reach 50 Test wickets,🔥 joining the ranks of the second-fastest players in Test cricket history! 🏏🎉
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) April 28, 2023
Jayasuriya hit the 50-wicket mark in just his seventh Test to snatch… pic.twitter.com/Jq6Ia2mZV0
ఇక తాజాగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. ఐదో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 5వికెట్లకు 121 పరుగులను స్కోర్ చేసింది. అంతకుముందు ఐర్లాండ్.. తన తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులకు ఆలౌటైంది. పాల్ స్టిర్లింగ్ సెంచరీతో చెలరేగాడు. ఇక టక్కర్, ఆండీ బాల్ బిర్నీ, కూడా శతకానికి చేరువుగా ఉన్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నిశాన్ మదుశంక, కుశాల్ మెండీస్ డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శనను కనబరిచారు. ఇక కెప్టెన్ దిముత్ కరుణరత్నే, మ్యాథ్యూస్ కూడా సెంచరీలతో చెలరేగారు. అలా శ్రీలంక 212 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది.
ఇక 212 పరుగులు వెనుకబడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు ప్రస్తుతం డ్రా కోసం పోరాడుతుంది. ఆటకు శుక్రవారం మ్యాచ్ చివరి రోజు కావడం వల్ల ఇది దాదాపుగా డ్రాగా ముగిసే అవకాశం ఉంది. టీ బ్రేక్లోపు ఐర్లాండ్‌ను ఆలౌట్ చేస్తే.. శ్రీలంక ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలున్నాయి. ఇక తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.