ETV Bharat / sports

విమానం అత్యవసర ల్యాండింగ్​.. ఆందోళనలో క్రికెటర్లు - ఇంగ్లాండ్​ శ్రీలంక క్రికెటర్లు

ఇంగ్లాండ్‌ నుంచి బయల్దేరిన శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రయాణిస్తున్న విమానం.. ఇంధన సమస్య తలెత్తడం వల్ల అకస్మాతుగా భారత్‌లో ల్యాండ్​ అయింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కంగారు పడ్డారు.

Sri Lanka Team
శ్రీలంక క్రికెటర్లు
author img

By

Published : Jul 7, 2021, 8:18 PM IST

ఇంగ్లాండ్‌ నుంచి బయల్దేరిన శ్రీలంక క్రికెట్‌ జట్టు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఇంధన సమస్య తలెత్తడం వల్ల వారు ప్రయాణిస్తున్న విమానాన్ని హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్‌ మైక్‌ ఆర్థర్‌ వెల్లడించారు.

"ఇంధన నష్టం జరగడం వల్ల మా విమానాన్ని భారత్‌కు దారి మళ్లించారు. అక్కడ మేం దిగగానే నా ఫోన్‌ ఆన్‌ చేశాను. ఇంగ్లాండ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వేన్‌ బెంట్లీ నుంచి నాకు కొన్ని సందేశాలు వచ్చాయి. పరిస్థితి గురించి అందులో వివరించాడు. దాంతో నిజంగా మేమంతా ఆందోళన చెందాం" అని ఆర్థర్‌ అన్నాడు.

మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం శ్రీలంక జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. సిరీసు ముగిసిన తర్వాత వారు స్వదేశానికి బయల్దేరారు. తీరా భారత్‌లో దిగాక విమానం దారి మళ్లించారన్న విషయం వారికి తెలిసింది. కాగా లంకేయులతో ఆడిన ఇంగ్లాండ్‌ జట్టులో ముగ్గురు క్రికెటర్లు, నలుగురు సహాయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దాంతో లంక క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌, శ్రీలంక పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసు తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

ఇదీ చూడండి: ఇండియా క్రికెటర్లకు వ్యాక్సిన్​ రెండో డోసు ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.