Sri Lanka Cricket Board Restored : శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ఆ దేశ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై కోర్టు స్పందించింది. బోర్డుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రద్దును ఉపసహరించుకోమంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. ఈ వ్యహారంపై పూర్తి స్థాయి విచారణ పెండింగ్‌లో ఉండటం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా బోర్డు సభ్యులు రెండు వారాల పాటు పదవిలో ఉండేందుకు కోర్టు అంగీకరించింది.
గత కొంత కాలంగా లంక బోర్డుపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ దేశ క్రీడల మంత్రి రణసింఘె.. శ్రీలంక క్రికెట్ బోర్డును తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బోర్డును రద్దు చేసి రణతుంగా నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. 'శ్రీలంక క్రికెట్ బోర్డు దేశంలోనే అత్యంత అవినీతి మయమైన సంస్థ. నేను దీనిని మార్చాలనుకుంటున్నాను' అని సోమవారం రణతుంగ వ్యాఖ్యానించారు. 2008లోనూ ఎస్‌ఎల్‌సీ వ్యవహారాల నిర్వహణకు ఏర్పాటు చేసిన మధ్యంత కమిటీకి రణతుంగ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
ఏం జరిగిందంటే..
నవంబర్ 2న ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో లంక జట్టు భారత్ చేతిలో ఓడింది. ఈ ఘోర పరాజయం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇలా ప్రపంచకప్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)పై వేటు పడింది. దీంతో క్రికెట్ బాధ్యతలను ఏడుగురు సభ్యులతో కూడిన ఓ మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసి వారికి అప్పగించారు. ఈ మధ్యంతర కమిటీలో రణతుంగతో పాటు ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులు, ఇద్దరు మహిళలు, ఎస్‌ఎల్‌సీ మాజీ అధ్యక్షుడు ఉపాలి ధర్మదాస ఉన్నారు.
ఇక ఈ విషయంపై శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే స్పందించారు. బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే నైతిక హక్కు లేదని.. తక్షణమే వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి మితిమీరిందన్న మంత్రి.. ఆ కారణంగానే బోర్డును తొలగించాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే 2023 వరల్డ్ కప్లో శ్రీలంక జట్టు ఘోర ఓటములతో బోర్డుపై విమర్శలు వచ్చాయి. దీంతో కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన కొలంబో పోలీసులు.. బోర్డు కార్యాలయ భవనం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
టైమ్డ్ అవుట్, హ్యాండిల్డ్ బాల్ - క్రికెట్‌లో ఎన్ని విధాలుగా ఔటవుతారో తెలుసా?
అదరగొట్టిన షమీ, చిత్తుగా ఓడిన శ్రీలంక- రికార్డ్ విజయంతో సెమీస్లోకి భారత్