David Miller little fan Passes Away: దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ భావోద్వేగానికి గురయ్యాడు. అభిమానిగా ఉన్న ఓ బాలిక క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. "మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా" అని పేర్కొంటూ ఓ ఎమోషనల్ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఆమెతో కలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">