ETV Bharat / sports

SA vs IND Test: 'అసలేం జరుగుతోంది.. దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేయాలా?'

author img

By

Published : Dec 14, 2021, 7:37 PM IST

SA vs IND Test: దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టీమ్​ఇండియా కీలక ఆటగాళ్లు గాయాలపాలవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. జట్టులో రోహిత్ శర్మ లేకపోవడం పెద్ద లోటే అని అభిప్రాయపడ్డాడు.

Akash Chopra
ఆకాశ్ చోప్రా

SA vs IND Test: దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్ధమవుతున్న టీమ్​ఇండియా టెస్టు జట్టుపై ఆందోళన వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. కీలక ఆటగాళ్లందరూ గాయాల కారణంగా టెస్టు సిరీస్​కు దూరమవుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీమ్​ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రాక్టీస్​ సెషన్​లో గాయమైంది. దీంతో టెస్టు సిరీస్​కు దూరమవుతున్నట్లు బీసీసీఐకి తెలిపాడు. ఇప్పటికే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్​మన్ గిల్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగానే జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనను బీసీసీఐ రద్దు చేస్తే బాగుంటుందని అకాశ్​ చోప్రా అభిప్రాయపడ్డాడు.

"రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్, శుభ్​మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేరు. ఇప్పుడు రోహిత్​ శర్మ కూడా ఉండడని చెబుతున్నారు. అసలేం జరుగుతోంది? భారత జట్టు ఈ పర్యటనను రద్దు చేయాలా?."

--ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.

జట్టులో రోహిత్​ శర్మ లేకపోవడం పెద్దలోటు అని ఆకాశ్ చోప్రా అన్నాడు. అతడు లేకపోతే సిరీస్​ గెలిచే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయని అభిప్రాయపడ్డాడు. మయాంక్ అగర్వాల్, కేఎల్​ రాహుల్​ ఓపెనర్లుగా దిగినా.. మూడో ఓపెనర్​ ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారిందని అన్నాడు. ఈ లెక్కలో చూస్తే.. టీమ్​ఇండియా టెస్టు జట్టు బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుందని పేర్కొన్నాడు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టులు, మూడు వన్డేలు జరగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్​ ప్రారంభంకానుంది. జనవరి 19 నుంచి వన్డే సిరీస్​ ప్రారంభమవుతుంది. అయితే.. రోహిత్ శర్మ టెస్టు సిరీస్​కు, విరాట్​ కోహ్లీ వన్డే సిరీస్​కు దూరం కానున్నారనే అంశం ప్రస్తుతం చర్చనియాంశంగా మారింది.

ఇదీ చదవండి:

IND vs SA Series: వన్డే సిరీస్​కు కోహ్లీ దూరం.. ఫ్యాన్స్​లో అనుమానాలు!

రోహిత్​ శర్మకు గాయం.. దక్షిణాఫ్రికా టెస్ట్​ సిరీస్​కు దూరం

ప్రపంచ ఛాంపియన్​గా టీమ్​ఇండియా.. మా లక్ష్యం అదే: రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.