ETV Bharat / sports

Sourav Ganguly: 'ద్రవిడ్ కూడా తప్పులు చేస్తాడు.. కానీ..' - రాహుల్​ ద్రవిడ్

Sourav Ganguly Rahul Dravid: టీమ్​ఇండియా ప్రధాన కోచ్​గా రాహుల్​ ద్రవిడ్.. అసాధారణ పనులు చేస్తాడని కొనియాడాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అయితే అందరిలానే అతడూ కొన్ని తప్పులు చేసే అవకాశం లేకపోలేదని అన్నాడు. ఇక మాజీ హెడ్​కోచ్​ రవిశాస్త్రి, ద్రవిడ్​ను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దాదా.

dravid ganguly
dravid ganguly
author img

By

Published : Apr 3, 2022, 10:50 PM IST

Sourav Ganguly Rahul Dravid: టీమ్​ఇండియా హెడ్​కోచ్​ రాహుల్​ ద్రవిడ్​పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భారీ అంచనాలున్నాయి! రవిశాస్త్రిని భర్తీ చేసినప్పటి నుంచి అతడి నేతృత్వంలో దక్షిణాఫ్రికా పర్యటన మినహా అన్ని ఫార్మాట్లలో భారత్​ మంచి ప్రదర్శన చేస్తోంది. ఈ క్రమంలోనే ద్రవిడ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దాదా.

"ద్రవిడ్​.. క్రికెట్​ ఆడే రోజుల్లో ఎంత ఫ్రొఫెషనల్​గా, పోటీతత్వంతో, శ్రద్ధగా ఉండేవాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఒక్కటే తేడా. అతడు ఇప్పుడు ఇండియా తరఫున మూడో స్థానంలో ఆడటం లేదు. అయితే కోచ్​గా అతడు అసాధారణంగా రాణిస్తాడు. ఎందుకంటే అతడికి అంత నిజాయతీ, ప్రతిభ ఉన్నాయి. అందరిలాగే అతడూ తప్పిదాలు చేసే అవకాశం ఉంది. అయితే సరైన పనుల కోసం ప్రయత్నించే కొద్దీ ఇతరుల కన్నా మెరుగైన విజయాలు సాధిస్తాం."

-సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఆసక్తికరంగా గంగూలీ, ద్రవిడ్ ఒకే టెస్టు మ్యాచ్​లో అరంగేట్రం చేశారు. భారత్​కు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. వ్యక్తిగతంగానూ ఇరువురికి మంచి సాన్నిహిత్యం ఉంది. రిటైర్ అయిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న దాదా.. ద్రవిడ్​ భారత ప్రధాన కోచ్​గా బాధ్యతలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇద్దరూ భిన్నమైనవారు: అయితే టీమ్​ఇండియా మాజీ హెడ్​కోచ్​ రవిశాస్త్రి, రాహుల్​ ద్రవిడ్​లది పూర్తి భిన్నమైన వ్యక్తిత్వాలని గంగూలీ అన్నాడు. "ఇద్దరూ భిన్న వ్యక్తిత్వాలు గల విభిన్న వ్యక్తులు. ఒకరు (శాస్త్రి) ఎల్లప్పుడూ ఆటగాళ్లతో ఉంటూ వారిని ప్రోత్సాహిస్తారు. అదే వారి బలం. మరొకరు ఆల్​టైమ్ గ్రేట్​ అయినప్పటికీ (ద్రవిడ్) సైలెంట్​గా తమ పని తాము చేసుకుంటూ పోతారు." అని దాదా చెప్పాడు.

ఇదీ చదవండి: 'ధోనీ నిర్ణయాలు తీసుకోవడమేంటి?'- జడేజా షాకింగ్​ కామెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.