ETV Bharat / sports

గంగూలీకి మరోసారి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ

author img

By

Published : Oct 27, 2021, 9:37 AM IST

Updated : Oct 27, 2021, 11:49 AM IST

ఇటీవల ఐపీఎల్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం నిర్వహించిన వేలంలో ఆర్పీఎస్జీ అధినేత సంజీవ్​ గోయంకాకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​​ గంగూలీ సాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలానే పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద గంగూలీ ఒకేసారి రెండు పదవుల్లో కొనసాగుతుండమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Ganguly
గంగూలీ

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో(Ganguly conflict of interest) మరోసారి చిక్కుకున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.

ఐపీఎల్​లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇటీవల జరిగిన వేలంలో(IPL franchise auction) అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ సొంతం చేసుకోగా.. లఖ్‌నవూను(IPL new teams) రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ వెంచర్స్​ అధినేత సంజీవ్​ గోయంకా దక్కించుకున్నారు. అయితే సంజీవ్​కు ఐపీఎల్​ ఫ్రాంచైజీ దక్కడంలో​ గంగూలీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్​ సూపర్​ లీగ్​(ఐఎస్​ఎల్​)లోని సంజీవ్ గోయంకా ఛైర్మన్​గా ఉన్న ఏటీకే-మోహన్​ బగన్​​ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​లో గంగూలీ సభ్యుడుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతేడాది జూన్​లో ఏటీకే క్లబ్​ బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​లో సభ్యుడుగా గంగూలీ ఎంపికయ్యాడు. ఇందులో ఉత్సవ్​ పరేఖ్​, శ్రిన్​జోయ్​ బోస్​, దెబాశిష్​ దత్తా​, గౌతమ్​ రేయ్​, సంజీవ్​ మెహ్రా సభ్యులుగా ఉన్నారు.

గంగూలీపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఓ బీసీసీఐ సీనియర్​ అధికారి.. "ఇది వివాదాస్పద అంశమని స్పష్టంగా తెలుస్తోంది. గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడని అర్థం చేసుకోవాలి. అతను ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు" అని పేర్కొన్నాడు.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై గంగూలీతో అనుబంధం గురించి ఓ టీవీ ఛానల్​ ఇంటర్వ్యూలో మాట్లాడిన గోయాంక​.. అతను (గంగూలీ) మెహన్​ బగన్​ నుంచి పూర్తిగా తప్పకున్నారని తెలిపారు. అయితే ఎప్పుడు జరిగిందని ప్రశ్నించగా.. మంగళవారం(అక్టోబరు 26) జరిగిందని అన్నారు. తర్వాత సారీ అంటూ.. 'ఈ విషయాన్ని గంగూలీ చెప్పాలి. అయితే నేనే ముందుగా చెప్పాను" అని అన్నాడు.

అయితే ఆ తర్వాత కూడా.. మెహన్​ బగన్​ నుంచి వైదొలుగుతున్నట్లు గంగూలీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఐపీఎల్​ ఫ్రాంచైజీ వేలంలో గోయంకాకు దాదా సాయం చేసినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. అయితే ఈ విషయమై గంగూలీ స్పందించాల్సి ఉంది.

ఇదీ చూడండి: IPL 2021: ఆ జట్టు ఖరీదు రూ.7,000 కోట్లు కాదు.. రూ.2,000 కోట్లే!

Last Updated : Oct 27, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.