ETV Bharat / sports

WPL 2024 కప్పు మాదే!- అభిమానుల ఆనందమే మా లక్ష్యం : RCB కెప్టెన్ స్మృతి మంధాన - Smriti Mandhana WPL 2024

Smriti Mandhana WPL 2024 : ఈ సారి ఎలాగైన కప్పు సాధించడమే తమ లక్ష్యం అని ఆర్​సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్​సీబీ అభిమానులకు ఆనందాన్ని కలిగించడమే తమ టార్గెట్ అని చెప్పింది. స్మృతి ఇంకా ఏమందంటే?

Smriti Mandhana WPL 2024
Smriti Mandhana WPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 12:55 PM IST

Updated : Dec 9, 2023, 1:36 PM IST

Smriti Mandhana WPL 2024 : ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు- ఆర్​సీబీ జట్టుకు భారీ స్థాయిలో అభిమానుల సపోర్ట్ ఉంది. కానీ 16 సార్లు ప్రయత్నం చేసినా ఆ జట్టుకు టైటిల్​ గెలిచే అదృష్టం దక్కలేదు. అయితే గతేడాది ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్​లో ఆర్​సీబీ అద్భుతమై జట్టుతో​ బరిలోకి దిగింది. దీంతో ఆర్​సీబీ అభిమానుల్లో టైటిల్​ ఆశలు మళ్లీ చిగురించాయి. అయితే పేపర్​పై జట్టు బలంగానే కనిపించినా మైదానంలో విఫలమై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఈ విషయంపై తాజాగా ఆర్​సీబీ మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన స్పందించింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పురుషులు జట్టుకు జరిగిన దాని గురించి తాము ఆలోచించమని తెలిపింది. తమ జట్టు కొత్తదన్న స్మృతి మంధాన 2008 నుంటి ఎదురు చూస్తున్న ఆర్​సీబీ అభిమానులకు డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్​ సాధించి ఆనందాన్ని ఇవ్వడమే తమ లక్ష్యం అని తెలిపింది.

గత రెండేళ్లలో భారత్​లో మహిళల క్రికెట్​ గణనీయమైన పురోగతి సాధించింది. డబ్ల్యూపీఎల్ ప్రారంభం కావడం, పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు ప్రకటించడం వంటి చారిత్రాత్మక ఘటనలు జరిగాయి. ప్రస్తుతం అభిమానులు మహిళా క్రికెట్​ను ప్రత్యేక కోణంలో చూస్తున్నారని స్మృతి మంధాన అభ్రిప్రాయపడింది. అది మహిళా క్రికెట్​ పురోగతికి సహాయం చేసిందని చెప్పింది. అయితే గత రెండేళ్లుగా వస్తున్న అభినందనలు, విమర్శలు వల్ల ఫ్యాన్స్​ మహిళా క్రికెట్​పై ఆసక్తి కనబరుస్తున్నారని అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

'గత 7-8 సంవత్సరాలలో (మహిళల క్రికెట్‌లో) భారీగా మార్పు వచ్చింది. కానీ అందులో అతి పెద్ద మార్పు ఏమిటంటే ప్రజలు మహిళల క్రికెట్‌ను చూస్తున్న విధానం. అది నిజంగా మంచి విషయం. వారు మమ్మల్ని అభినందిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎందుకంటే వారు మహిళా క్రికెట్​ను ఫాలో అవుతున్నారు. ఇది మంచి పరిణామం. WPL, సమాన వేతనం కాకుండా, మహిళల క్రికెట్‌ను చూసే విధానంలో ఇది ఒక భారీ మార్పు అని నేను భావిస్తున్నాను' అని మంధాన చెప్పింది.

బీసీసీఐ నెట్​వర్త్​ రూ.18760 కోట్లు- ఆస్ట్రేలియా కన్నా 28 రెట్లు ఎక్కువ

'20 కేజీలు తగ్గితే ఐపీఎల్​లో తీసుకుంటా' - అఫ్గాన్​ ప్లేయర్​పై ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Last Updated : Dec 9, 2023, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.