Smriti Mandhana Husband Qualities : టీమ్ఇండియా మహిళల జట్టు ప్లేయర్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట తీరుతో ప్రేక్షుకలను అబ్బురపరిచే ఈ స్టార్ క్రికెటర్, తన అందంతోనూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవలే ఇంగ్లాండ్,ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించింది. ఇలా తనకంటూ క్రికెట్ హిస్టరీలో ఓ స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది.
అయితే తాజాగా ఈ యంగ్ ప్లేయర్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ప్రోగ్రామ్‌కు వెళ్లింది. ఇందులో ఆమెతో పాటు టీమ్ఇండియా పురుషుల జట్టు ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ హోస్ట్ అడిగిన ప్రశ్నలతో పాటు ఆడియెన్స్ అడిగిన వాటిని ఆన్సర్స్ ఇస్తూ సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని స్మృతిని షాకింగ్ ప్రశ్న అడిగారు.
'మీకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటారు' అంటూ ఆ ఫ్యాన్స్ అడిగారు. దానికి స్మృతికి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు సిగ్గుపడింది. ఆ తర్వాత బదులిచ్చింది. " ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని నేను అసలు ఊహించలేదు. అయితే నాకు మాత్రం అతడు మంచి అబ్బాయి అయి ఉండాలి. అంతే కాకుండా నా కెరీర్‌ను అర్థం చేసుకోవాలి. అలాగే కేరింగ్‌గా కూడా ఉండాలి. ఈ రెండు క్వాలిటీస్ అతడిలో కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నా కెరీర్ కారణంగా ఓ అమ్మాయిగా నేను అతడికి నేను ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. అందుకే అతడు నా పరిస్థితిని, ఆటను అర్థం చేసుకునే వాడు అయ్యుండాలి. నాకు కాబోయే భర్తలో ఈ లక్షణాలను ముఖ్యంగా చూస్తాను'' అని స్మృతి మంధాన ఆన్సర్ చెప్పింది.
-
Bolo na k phool jaisa ladka mil gaya hai!#CricketTwitter
— Asli BCCI Women (@AsliBCCIWomen) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/L7vUyqDazJ
">Bolo na k phool jaisa ladka mil gaya hai!#CricketTwitter
— Asli BCCI Women (@AsliBCCIWomen) December 26, 2023
pic.twitter.com/L7vUyqDazJBolo na k phool jaisa ladka mil gaya hai!#CricketTwitter
— Asli BCCI Women (@AsliBCCIWomen) December 26, 2023
pic.twitter.com/L7vUyqDazJ
Smriti Mandhana Career : ఇక స్మృతి కెరీర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆమె 6 టెస్టులు, 80 వన్డేలు, 125 టీ20లు ఆడింది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 480 పరుగులు, వన్డేల్లో 3,179 రన్స్ బాదింది. అంతే కాకుండా పొట్టి ఫార్మాట్‌లో 2,998 పరుగులు సాధించింది. ఇక బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో మంధాన రికార్డు ధరతో చరిత్ర సృష్టించింది. ఆమెను ప్రముఖ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్లకు సొంతం చేసుకుంది.
అలా చేస్తే మహిళా క్రికెట్‌కు తిరుగుండదు- WPL 2024లో ఆ మార్పు చేయాలి! : స్మృతి మంధాన
WPL 2024 కప్పు మాదే!- అభిమానుల ఆనందమే మా లక్ష్యం : RCB కెప్టెన్ స్మృతి మంధాన