Sivam Dube corona: దేశవాళీ క్రికెట్‌పై కరోనా మళ్లీ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ముంబయి ఆల్‌రౌండర్ శివమ్ దూబె, జట్టు వీడియో విశ్లేషకుడికి కరోనా సోకింది. దీంతో దుబె స్థానంలో సైరాజ్ పాటిల్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా, దూబె టీమ్ఇండియా తరఫున ఒక వన్డే, 13 టీ20లు ఆడాడు.
జనవరి 13 నుంచి రంజీ ట్రోఫీలు ప్రారంభంకానున్నాయి. కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా టోర్నీ కోసం కోల్‌కతాకు బయలుదేరేముందు చేసిన పరీక్షల్లో దూబెకు పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చూడండి: హొలీ ఫెర్లింగ్.. బ్యాట్ పట్టిన బార్బీబొమ్మ!