ETV Bharat / sports

'క్రికెట్​ వదిలేసి ఆటో తోలుకో అన్నారు- మహీ చెప్పిన ఆ మాటతో..'

Siraj News: 2019 ఐపీఎల్​ సీజన్​ తర్వాత.. తనను కొందరు దారుణంగా ట్రోల్స్​ చేశారని అన్నాడు టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ సిరాజ్​. క్రికెట్​ వదిలేసి.. తండ్రితో ఆటో నడుపుకోమని అన్నట్లు తాజాగా వెల్లడించాడు. మహీ చెప్పిన ఆ ఒక్క మాటతోనే కోలుకున్నట్లు తెలిపాడు.

siraj news,  quit cricket and drive auto
siraj news, quit cricket and drive auto
author img

By

Published : Feb 8, 2022, 3:25 PM IST

Siraj News: ప్రస్తుతం టీమ్​ఇండియా తరఫున రాణిస్తున్న పేసర్​ మహ్మద్​ సిరాజ్​.. గతంలో దారుణంగా ట్రోల్స్​ ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. 2019 ఐపీఎల్​లో పేలవ ప్రదర్శనతో.. చాలా మంది క్రికెట్​ వదిలేసి తండ్రితో ఆటో నడుపుకోమని అన్నట్లు తెలిపాడు. అప్పుడే ఇక తన కెరీర్​ ముగిసిపోయిందని, మహీ ఆ ఒక్క మాట చెప్పకుంటే.. మళ్లీ సిరాజ్​ ఇలా ఉండకపోయేవాడని వివరించాడు.

''కోల్​కతా నైట్​రైడర్స్​తో మ్యాచ్​లో రెండు బీమర్లు వేశాను. అప్పుడే ట్రోల్స్​ ఎదుర్కొన్నా. కానీ ఈ వైఫల్యం వెనుక కారణం ఎవరికీ తెలియదు. అప్పుడే మహీ చెప్పిన విషయం గుర్తొచ్చింది. తన గురించి జనం మాట్లాడుకునేది వినొద్దని, ఇవ్వాళ తిట్టిన వాళ్లే రేపు పొగుడుతారని చెప్పాడు. అందుకే నాకు ఎవరి అభిప్రాయం వద్దు. నేను ఒకప్పటి సిరాజ్​లానే ఉన్నా.''

- మహ్మద్​ సిరాజ్​

2019 ఐపీఎల్​ సీజన్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో దిగువన నిలిచింది. వరుసగా ఆరు మ్యాచ్​ల్లో ఓడిపోయింది. 9 మ్యాచ్​లాడిన సిరాజ్​.. 10కిపైగా ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. కోల్​కతాపై 2.2 ఓవర్లలోనే 36 పరుగులు ఇచ్చి విమర్శల పాలయ్యాడు సిరాజ్​. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో కెప్టెన్​ కోహ్లీ.. సిరాజ్​ బౌలింగ్​ను ఓవర్​ మధ్యలోనే ఆపివేయడం గమనార్హం.

ఇప్పుడు ప్రశంసలు..

ఆ తర్వాత కుంగిపోకుండా.. ఆటపై దృష్టి పెట్టి అద్భుతంగా రాణించాడు. 2010 ఐపీఎల్​ సీజన్​లో మంచి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం.. టీమ్​ ఇండియాకు తొలిసారి ఎంపికయ్యాడు. ఆసీస్​ గడ్డపై భారత్​ చారిత్రక విజయం సాధించిన.. గబ్బా టెస్టులో 5 వికెట్ల ప్రదర్శనతో అతడి పేరు మారుమోగిపోయింది. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. దురదృష్టం ఏంటంటే.. ఆ సిరీస్​ సమయంలోనే తండ్రిని కోల్పోయాడు సిరాజ్​.

Ind vs WI Odi: ప్రస్తుతం విండీస్​తో సిరీస్​కు కూడా భారత్​ జట్టుకు ఎంపికయ్యాడు సిరాజ్​.

ఫిబ్రవరి 6న జరిగిన తొలి వన్డేలో 8 ఓవర్లు బౌలింగ్​ చేసిన సిరాజ్​.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్​ పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడెన్లు ఉండటం విశేషం. తొలి వికెటే షై హోప్​ను క్లీన్​బౌల్డ్​ చేసి.. భారత్​కు శుభారంభాన్ని అందించాడు.

ఆ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన వెస్టిండీస్​.. ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. మన బౌలర్ల స్పిన్​ మాయాజాలానికి చిక్కిన కరీబియన్లు.. 176 పరుగులకే ఆలౌట్​ అయ్యారు. హోల్డర్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో చాహల్ 4, సుందర్ 3, ప్రసిద్ధ్ 2, సిరాజ్ ఓ వికెట్ తీశారు.

177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్​ఇండియా.. 28 ఓవర్లలో దానిని పూర్తి చేసింది. ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్.. తొలి వికెట్​కు 84 పరుగులు జోడించారు. అనంతరం 60 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. కోహ్లీ, పంత్​ నిరాశపర్చినా.. సూర్యకుమార్​ యాదవ్​, దీపక్​ హుడా నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.

ఇరు జట్ల మధ్య రెండో వన్డే.. ఫిబ్రవరి 9న అహ్మదాబాద్​ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

ఇవీ చూడండి: యాంకర్​గా మారిన రోహిత్.. చాహల్‌తో ఫన్నీ ఇంటర్వ్యూ..

IND VS WI: భారత్ ధమాకా.. విండీస్​పై ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.