Shubman Gill Most Searched On Google : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 2023లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన భారత అథ్లెట్‌గా నిలిచాడు. ఈ ఏడాది గూగుల్‌లో దేశంలో ట్రెండ్ అయిన వ్యక్తుల జాబితాను 'గూగుల్ ఇండియా' సోమవారం వెల్లడించింది. ఈ లిస్ట్‌లో గిల్ తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర, మహ్మద్ షమీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్, ట్రావిస్ హెడ్ నిలిచారు.
అయితే 2023 సంవత్సరం గిల్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు. దీంతో సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఐదో బ్యాటర్‌గా గిల్ రికార్డు కొట్టాడు. ఇక రీసెంట్గా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ గిల్ ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం గిల్ 826 రేటింగ్స్‌తో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. మరోవైపు 2023 ఆసియా కప్, 2023 వన్డే వరల్డ్కప్నకూ ఎంపికైన గిల్ ఈ ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌ల్లో తన మార్క్ చూపించాడు.
-
Top-Most Google Search In 2023 🇮🇳🔍
— RVCJ Media (@RVCJ_FB) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(5/9) pic.twitter.com/FSi95Bkbo3
">Top-Most Google Search In 2023 🇮🇳🔍
— RVCJ Media (@RVCJ_FB) December 11, 2023
(5/9) pic.twitter.com/FSi95Bkbo3Top-Most Google Search In 2023 🇮🇳🔍
— RVCJ Media (@RVCJ_FB) December 11, 2023
(5/9) pic.twitter.com/FSi95Bkbo3
Shubman Gill Captain : 2024 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్ జట్టుకి ట్రేడవడం వల్ల గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది గుజరాత్ యాజమాన్యం. దీంతో బ్యాటర్ నుంచి గిల్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చినట్లైంది.
Shubman Gill IPL Stats : గిల్ తన ఐపీఎల్ కెరీర్లో 33 ఇన్నింగ్స్‌ల్లోనే 1373 పరుగులు 47.34 చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత సీజన్లోనే 17 మ్యాచ్‌ల్లో గిల్ 890 పరుగులు బాది.. టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఇక ప్లేఆఫ్స్‌లో ముంబయి ఇండియన్స్‌పై గిల్ 60 బంతుల్లో 129 పరుగులు బాది గుజరాత్ గెలుపులో కీలకంగా మారాడు.
'కెప్టెన్సీలో రాణించాలంటే విధేయత కూడా ఉండాలి' - గిల్ కామెంట్స్ అతడ్ని ఉద్దేశించేనా?
టాప్ పొజిషన్‌కు గిల్ - కెరీర్లో అత్యుత్తమం, ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్