టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంకా ఒంటరేనని, ఇప్పట్లో ఎవరితోనూ ప్రేమలో పడే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా తెందూల్కర్‌తో ఈ యువ బ్యాట్స్‌మన్ ప్రేమాయణం సాగిస్తున్నాడనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. మీరింకా ఒంటరిగానే ఉన్నారా? అని ఓ అభిమాని అడిగాడు. 'అవును నేనింకా ఒంటరిగానే ఉన్నా. ఇప్పట్లో ఎవరితోనూ కలిసే ఆలోచనలు లేవు' అని తనపై వచ్చే పుకార్లకు తెరదించాడు. అయితే, ఇలా రిప్లై ఇచ్చిన కామెంట్‌ను అతడు తర్వాత తొలగించడం గమనార్హం. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటన కోసం ముంబయిలో క్వారంటైన్‌లో ఉన్న శుభ్‌మన్ తాజాగా ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు అతడిలా సమాధానాలు చెప్పుకొచ్చాడు. అవేంటో మీరూ చదవండి..
- ఒక మంచి వెబ్ సిరీస్ చూడటానికి పేరు చెప్పండి?
శుభ్‌మన్: పీకి బ్లిండర్స్
- తొలి ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఎలా ఉంది?శతకం కోసం ముందే శుభాకాంక్షలు
శుభ్‌మన్: బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
- క్రికెట్ కాకుండా మీకు ఇష్టమైన మరో ఆట?
శుభ్‌మన్: బాస్కెట్‌బాల్, సాకర్..
- సందీప్ వారియర్‌ను గత మూడేళ్లుగా నెట్స్‌లో ఎదుర్కోవడం ఎలా ఉంది?(వారియర్ ప్రశ్న)
శుభ్‌మన్: నీ బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా బాగుంది..
- ప్రతి పోస్టులో నీ నాలుక బయటకు ఎందుకు వస్తుంది? (అక్షర్ పటేల్)
శుభ్‌మన్: ఎందుకంటే అందులోనే సరదా దాగి ఉంది.
- లూడో కింగ్‌లో నువ్వెందుకు మోసం చేస్తావు?
శుభ్‌మన్: అది అసంభవం..
- టీమ్‌ఇండియా అండర్-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్ కాకుండా నీకిష్టమైన సపోర్ట్ స్టాఫ్ ఎవరు?
శుభ్‌మన్: కచ్చితంగా మీరే దేవరాజ్ రౌత్
- ఒక డాన్స్ ఛాలెంజ్‌పై రీల్ వీడియో చేస్తావా?
శుభ్‌మన్: షటాప్..
- నీ దుస్తులు, చాక్లెట్లు ఎత్తుకెళ్లినా నువ్వేమీ చేయలేని వారు ఎవరు?
శుభ్‌మన్: నువ్వేరా జుగ్నూ (అతడి స్నేహితుడు)
ఇదీ చదవండి: గుర్రానికి ధోనీ మసాజ్.. వీడియో వైరల్