ETV Bharat / sports

Shubman Gill 2023 Stats : గిల్ అన్​స్టాపబుల్.. యంగ్​స్టర్ దెబ్బకు రికార్డులు దాసోహం - శుభ్​మన్ గిల్ 2023 వన్డే ర్యాంకింగ్

Shubman Gill 2023 Stats : భారత్ యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ ఈ ఏడాది అసాధారణ రీతిలో చెలరేగుతున్నాడు. 2023లో ఇప్పటికి ఏడు సెంచరీలు నమోదు చేసిన గిల్.. ఎన్నో రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు.

Shubman Gill 2023 Stats
Shubman Gill 2023 Stats
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 8:41 PM IST

Shubman Gill 2023 Stats : టీమ్ఇండియా యువ సంచలనం శుభ్​మన్ గిల్.. కెరీర్​లో అత్యుత్తమ ఫామ్​తో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాపై గిల్ సాధించిన శతకంతో కలిపి ఈ ఏడాది అతడు.. 7 సార్లు వందకు పైగా పరుగులు చేశాడు. అందులో వన్డేల్లోనే 5 సెంచరీలు సాధించాడు. ఇక మొత్తంగా 1763 పరుగులు బాదగా.. అందులో 1230 వన్డేల్లోనే చేశాడు. ఈ క్రమంలో అతడు అందుకున్న ఘనతలేంటో తెలుసుకుందాం.

వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో తొలి 6 సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు..

  • శుభ్​మన్ గిల్ - 35 ఇన్నింగ్స్​
  • శిఖర్ ధావన్ - 46 ఇన్నింగ్స్​
  • కేఎల్ రాహుల్ - 53 ఇన్నింగ్స్​
  • విరాట్ కోహ్లీ - 61 ఇన్నింగ్స్​
  • గౌతమ్ గంభీర్ - 68 ఇన్నింగ్స్​.

క్యాలెండర్ ఇయర్ (ఒకే సంవత్సరం) వన్డేల్లో 5 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు..

  • విరాట్ కోహ్లీ - నాలుగు సార్లు (2012, 2017, 2018, 2019)
  • రోహిత్ శర్మ - మూడు సార్లు (2017, 2018, 2019)
  • సచిన్ తెందూల్కర్ - రెండు సార్లు (1996, 1998)
  • రాహుల్ ద్రవిడ్ - (1999)
  • సౌరభ్ గంగూలీ - (2000)
  • శిఖర్ ధావన్ - (2013)
  • శుభ్​మన్ గిల్ - (2023)

ఆసియా కప్​.. ఇటీవల ముగిసిన 2023 ఆసియా కప్​ టోర్నమెంట్​లో కూడా గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మినీ టోర్నీలో 6 మ్యాచ్​లు ఆడిన గిల్​.. 302 పరుగులు చేశాడు. దీంతో టోర్నమెంట్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్​లో నిలిచాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Shubman Gill ODi Stats : ఇప్పటివరకు వన్డేల్లో 35 మ్యాచ్​లు ఆడిన గిల్.. 66.10 సగటున, 102.84 స్ట్రైక్ రేట్​తో 1917 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్ధ శతకాలు ఉండగా.. ఆరు శతకాలు బాదాడు. ఇక ఇదే ఏడాది న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​లో 149 బంతుల్లో 208 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో మేటి బ్యాటర్లను సైతం వెనక్కి నెట్టి 814 రేటింగ్స్​తో గిల్.. రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్​లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్.. 857 రేటింగ్స్​లో టాప్​లో ఉన్నాడు. అయితే ఆసీస్​తో బుధవారం జరిగే మూడో మ్యాచ్​లో గిల్​.. మంచి ఇన్నింగ్స్​తో రాణిస్తే.. అగ్రస్థానం దక్కించుకునే అవకాశం ఉంది. ఇలా ప్రపంచకప్​ సమీపిస్తున్నతరుణంలో గిల్.. అద్భుతమైన ఫామ్​లో ఉండడం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశమే.

Gill World Record : శుభ్​మన్‌ గిల్‌ నయా చరిత్ర.. పాక్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు బ్రేక్​.. ఏకంగా..

Shubman Gill Opening : మా జోడీయే ప్రపంచకప్​లో భారత్​కు కీలకం.. ఓపెనింగ్ చేసేటప్పుడు అందరి దృష్టి అతడిపైనే : గిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.