ETV Bharat / sports

శ్రేయస్ అయ్యర్​ మెరుపు ఇన్నింగ్స్​.. ఫైనల్​లో తొలిసారి ముంబయి - సయ్యద్​ అలీ ట్రోఫీ శ్రేయస్ అయ్యర్​

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్లో ముంబయి తొలిసారి ఫైనల్​కు దూసుకెళ్లింది. శ్రేయస్​ అయ్యర్​(77) మెరుపు ఇన్నింగ్స్​ తోడవ్వడం వల్ల ఈ విజయం దక్కింది.

Shreyas iyer mumbai syed ali trophy
శ్రేయస్ అయ్యర్​ మెరుపు ఇన్నింగ్స్
author img

By

Published : Nov 4, 2022, 9:26 AM IST

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్లో ముంబయి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. తొలిసారి ఫైనల్​కు దూసుకెళ్లింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా విదర్భతో​ జరిగిన సెమీఫైనల్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (73; 44 బంతుల్లో 7×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో 5 వికెట్ల తేడాతో ముంబయి విజయం సాధించింది.

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఛేదనలో 31/2తో తడబడింది. ఈ స్థితిలో మొదట పృథ్వీ షా (34; 21 బంతుల్లో 2×4, 3×6) ఆ తర్వాత సర్ఫ్‌రాజ్‌ఖాన్‌ (27)తో కలిసి శ్రేయస్‌ జట్టును విజయానికి చేరువ చేశాడు. కానీ ఈ ముగ్గురు వెనదిరిగినా.. శివమ్‌ దూబె (13 నాటౌట్‌), ములానీ (1 నాటౌట్‌) పని పూర్తి చేశారు. ముంబయి 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు విధర్భ.. తొలి ఇన్నింగ్స్​ ఆడిన విదర్భ 164/7 స్కోరు చేసింది. 28 పరుగులకే 2 వికెట్లు పడినా.. అపూర్వ్‌ (34), అథర్వ (29) జట్టును ఆదుకున్నారు. వీరితో పాటు ఆఖర్లో జితేశ్‌ శర్మ (46 నాటౌట్‌; 24 బంతుల్లో 3×4, 3×6) ధాటిగా ఆడడంతో విదర్భ పోరాడే స్కోరు చేసింది. ఇక ఈ విజయంతో ముంబయి ఫైనల్లో హిమాచల్‌ ప్రదేశ్‌తో తలపడనుంది.

మరో సెమీస్‌లో హిమాచల్‌ 13 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మొదట హిమాచల్‌ 176/7 స్కోరు చేసింది. సుమీత్‌వర్మ (51; 25 బంతుల్లో 3×4, 3×6), ఆకాశ్‌ వశిష్ట్‌ (43; 25 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. ఛేదనలో పంజాబ్‌ 163/7 పరుగులే చేయగలిగింది. శుభ్‌మన్‌ గిల్‌ (45; 32 బంతుల్లో 6×4, 1×6), అన్మోల్‌ ప్రీత్‌సింగ్‌ (30; 25 బంతుల్లో 3×4, 1×6), కెప్టెన్‌ మన్‌దీప్‌సింగ్‌ (29; 15 బంతుల్లో 3×4, 1×6), రమణ్‌దీప్‌సింగ్‌ (29; 15 బంతుల్లో 3×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. హిమాచల్‌ బౌలర్లలో రిషి ధావన్‌ (3/25), మయాంక్‌ దాగర్‌ (2/27) ప్రత్యర్థికి కళ్లెం వేశారు.

ఇదీ చూడండి: మెరిసిన చెస్​ ప్లేయర్లు.. ప్రజ్ఞానంద, నందిదలకు టైటిళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.