సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. మళ్లీ పాత కోహ్లీని గుర్తు చేస్తూ.. అద్భుతమైన శతకంతో విరాట్ అలరించాడు. గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 200 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకున్నాడు ఈ పరుగుల రారాజు. నిన్నటి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి కోహ్లీ (122) వీర విహారం చేశాడు. అయితే కోహ్లీ ఓపెనింగ్‌పై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'అఫ్గాన్‌పై కోహ్లీ ఓపెనర్‌గా ఎలా ఆడాడో చూశాం. అలాగే భారత టీ20 టోర్నీలో కూడా అతడు బాగా రాణించాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో విరాట్‌ను రెగ్యులర్ ఓపెనర్‌గా చూడొచ్చా?' అని మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించాడు. దీనికి రాహుల్ కాస్త అసహనంగా 'అయితే ఏంటి? నేను ఖాళీగా కూర్చోవాలా?' అని సమాధానమివ్వడం గమనార్హం. 'కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమ్‌ఇండియాకు నిజంగా శుభపరిణామం. ఈ మ్యాచ్‌లో ఆడిన తీరుతో అతడు చాలా సంతోషిస్తున్నాడని నాకు తెలుసు. అయితే, మూడో స్థానంలోనూ అతడు సెంచరీలు సాధించగలడు' అని రాహుల్ వివరించాడు.
అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 122 నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో తన తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. ఇక భారత టీ20 టోర్నీలో బెంగళూరు తరఫున విరాట్ 5 శతకాలు సాధించగా.. అవన్నీ ఓపెనర్‌గా చేసినవే కావడం గమనార్హం.
ఇవీ చదవండి: విరాట్ సెంచరీతో అనుష్క ఫుల్ ఖుష్.. ఇన్‌స్టాలో లవ్ నోట్