ETV Bharat / sports

'అభిమానులారా.. భారత్​కు మన సహకారం అవసరం' - భారత్​లో కరోనా సంక్షోభం

కరోనా సంక్షోభంపై పోరులో భారత్​కు దన్నుగా నిలవాలని తన అభిమానులను కోరాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. భారత్​ కోసం నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే, వైరస్​ తీవ్రత దృష్ట్యా ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు భారత క్రికెటర్లు జడేజా, రైనా.

Akhtar appeals for help to tackle India's coronavirus crisis
భారత్​ను ఆదుకోవాలని అక్తర్ విన్నపం
author img

By

Published : Apr 25, 2021, 9:24 AM IST

Updated : Apr 25, 2021, 11:57 AM IST

కొవిడ్​ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న భారత్​ను ఆదుకోవాలని పాకిస్థాన్​లోని తన అభిమానులను కోరాడు ఆ దేశ మాజీ పేసర్ షోయబ్​ అక్తర్. ఈ సమయంలో ప్రపంచ దేశాల సహకారం భారత్​కు అవసరమని తన యూట్యూబ్​ ఛానెల్​లో​ వ్యాఖ్యానించాడు.

"ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం అసాధ్యం. భారత్​ను ఆదుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని, నా అభిమానులను కోరుతున్నా. భారత్​కు చాలా ఆక్సిజన్ ట్యాంకులు అవసరం. ఆ దేశం కోసం విరాళాలు, నిధులు సమకూర్చి, ఆక్సిజన్​ ట్యాంకులను చేరవేయాలని విజ్ఞప్తి చేస్తున్నా."

- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్

భారత్​లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోందని అక్తర్​ పేర్కొన్నాడు. మహమ్మారి అందరినీ పీడిస్తోందన్న ఆయన.. ఈ సమయంలో ఒకరికొకరు తోడుగా నిలవాలని పిలుపునిచ్చాడు.

పోరులో ఐక్యం కావాలి..

మహమ్మారిపై పోరులో ప్రజలు ఏకమై, నిబంధనలు పాటించాలని కోరాడు భారత ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా. నిస్వార్థంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.

Akhtar appeals for help to tackle India's coronavirus crisis
జడేజా ట్వీట్

అందరూ ఇళ్లలోనే..

దేశ ఆరోగ్య వ్యవస్థ దుర్బలంగా మారుతోందని, మునుపెన్నడూ లేని విధంగా అనేకమంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భారత మాజీ క్రికెటర్​, ఐపీఎల్​లో సీఎస్​కే బ్యాట్స్​మన్ సురేశ్ రైనా అన్నాడు. వీలైనంత వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరాడు.

రైనా ట్వీట్​

ఇదీ చూడండి: కరోనా ఉన్నా.. దిల్లీ మ్యాచ్​లు అక్కడే!

Last Updated : Apr 25, 2021, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.