ETV Bharat / sports

మయాంక్​పై వేటు.. పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌

author img

By

Published : Nov 3, 2022, 9:34 AM IST

ఐపీఎల్​ కొత్త సీజన్​కు సంబంధించిన పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్​ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్​ను నియమించింది. శిఖర్‌ ధావన్​ను సారథిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది.

shikhar dhawan
శిఖర్‌ ధావన్‌

2023 ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో శిఖర్‌ ధావన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బుధవారం ఆ ఫ్రాంఛైజీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో మయాంక్‌ విఫలమవడంతో కెప్టెన్‌ మార్పు తప్పదనిపించింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు కేఎల్‌ రాహుల్‌ వెళ్లడంతో పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా బాధ్యతలు స్వీకరించిన మయాంక్‌.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించలేకపోయాడు.

"ధావన్‌ను కెప్టెన్‌గా నియమించాలని బోర్డు నిర్ణయించింది. ఐపీఎల్‌లో ఆటగాడిగా, సారథిగా అతనికి అనుభవముంది. జట్టు తరపునా మంచి ప్రదర్శన చేశాడు" అని పంజాబ్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు ట్రెవర్‌ బేలిస్‌ రూపంలో జట్టుకు కొత్త కోచ్‌ రానున్నాడు.

ఇదీ చదవండి: T20 WorldCup:టీమ్​ఇండియా ప్రదర్శనపై దాదా కీలక వ్యాఖ్యలు

'భారతీయుడు 2'లో టీమ్ఇం​డియా స్టార్​​ క్రికెటర్​ తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.