టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ దంపతులు(Shikhar dhawan) అభిమానులు షాక్ ఇచ్చారు. వీరిద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని అయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేదని ఆమె పేర్కొంది. విడాకుల విషయంపై శిఖర్ ధావన్ ఇంతవరకు స్పందించలేదు.
మెల్‌బోర్న్ బాక్సర్ అయిన అయేషా ముఖర్జీతో ధావన్ ప్రేమలో పడ్డాడు. దీంతో 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయేషా ముఖర్జీకి గతంలోనే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్ ధావన్‌తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు(జొరావర్) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది.
"వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తివంతమైన అర్థాలు కలిగి ఉంటాయి.మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. జీవితంలో విఫలమైనట్లు, తప్పుచేస్తున్నట్లుగా భావించాను. నా తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురిచేసినట్లు అనుకున్నాను. ఇక రెండోసారి విడాకులు తీసుకోవడం అనేది ఊహించుకుంటే భయంకరంగా ఉంది. ఈ సమయంలో నన్ను నేను మళ్లీ నిరూపించుకోవాలి."
-అయేషా ఇన్‌స్టా పోస్ట్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
శ్రీలంకతో జరిగిన పరిమిత వన్డే, టీ20 సిరీస్‌లకు ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్.. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టును బుధవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంకో రెండో ఓపెనర్ కోసం రాహుల్‌తో ధావన్ పోటీపడాల్సి వస్తోంది.
ఇదీ చూడండి.. రోహిత్ సెంచరీ చేస్తే- భారత్ గెలవాల్సిందే!