ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Subhaman Gill) స్థానంలో.. శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను(Devadutt Padikkal, Prithvi shah) పంపించనున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ విషయమై బీసీసీఐ(BCCI), సెలక్షన్ కమిటీ(Selection committee), జట్టు యాజమాన్యం(Team management) మధ్య సఖ్యత కనిపించట్లేదని అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. షా, పడిక్కల్‌ను ఇంగ్లాండ్‌కు పంపించట్లేదని స్పష్టం చేశారు. వారిద్దరూ శ్రీలంక సిరీస్ ఆడతారని తెలిపారు.
"పృథ్వీ షా శ్రీలంకలోనే ఉండి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడతాడు. అతడిని ఆ సిరీస్ కోసమే ఎంపిక చేశాం. అతడు తన కమిట్మెంట్ను పూర్తి చేస్తాడు. శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత ఏమైన అవకాశాలు ఉంటే పరిశీలిస్తాం. ప్రస్తుతమైతే ఏ ఆలోచన లేదు." అని సదరు అధికారి అన్నారు.
గిల్ గాయపడిన తర్వాత తమకు ఇద్దరు ఓపెనర్లు కావాలని టీమ్ మేనేజ్మెంట్.. సెలక్షన్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ప్రతిపాదనను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తిరస్కరించిందని తెలిసింది. ఇప్పటికే అక్కడ అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉండగా మరో ఇద్దరు ఎందుకన్న ఉద్దేశంలో విజ్ఞప్తిని పట్టించుకోలేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్‌కు అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై మాట్లాడిన సదరు అధికారి.. ఈశ్వరన్ అనుకున్న స్థాయిలో రాణిస్తాడనే నమ్మకం లేక ఇద్దరు ఓపెనర్లను కోరినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: Teamindia: ద్రవిడ్ అసహనం.. కోహ్లీసేన అసంతృప్తి!