టీమ్ఇండియాకు హెడ్ కోచ్‌గా సేవలందించి ఇటీవల పదవి నుంచి వైదొగలిన మాజీ ఆటగాడు రవిశాస్త్రి కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) కమిషనర్ పదవీ (Legends League Cricket) బాధ్యతలను ఎల్ఎల్సీ యాజమాన్యం శాస్త్రికి అప్పగించినట్లు సమాచారం.
అయితే రవిశాస్త్రికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించినా.. కమిషనర్ పదవి (Legends League Cricket) గురించి ఎల్ఎల్సీ బోర్డు ఎక్కడా స్పష్టం చేయలేదు.
"దిగ్గజాలు ఆడే ఈ టోర్నీ ద్వారా క్రికెట్‌కు సేవలు అందించేందుకు మరోసారి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ టోర్నీ అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని.. భవిష్యత్తులో మరింత ఆదరణ పెరుగుతుందని కచ్చితంగా చెప్పగలను."
-రవిశాస్త్రి, మాజీ టీమ్ఇండియా కోచ్
"భారత్ సహా ప్రపంచ క్రికెట్లో రవిశాస్త్రీ ఓ దిగ్గజ ఆటగాడిగా నిలిచాడు. ఈ లీగ్‌ను సరైన మార్గంలో నడిపించేందుకు మాకు ఇంతకన్నా గొప్ప వ్యక్తి దొరకరు."
-రమన్ రహేజా, ఎల్ఎల్సీ సీఈఓ
గల్ఫ్ వేదికగా వచ్చే ఏడాది జనవరీలో ఈ లీగ్ ప్రారంభం కానుంది. రిటైరైన క్రికెటర్ల ఆడేందుకు ఈ టోర్నీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : Ravi Shastri: వాళ్లను మందు కొట్టడానికి పిలుస్తా: రవిశాస్త్రి