ETV Bharat / sports

ఆ ఫలితం తర్వాతే స్వదేశానికి రవిశాస్త్రి - కరోనా వైరస్

టీమ్​ఇండియా హెడ్​ కోచ్ రవిశాస్త్రి (ravi shastri) త్వరలోనే భారత్​ చేరుకునే అవకాశం ఉంది. కరోనా బారినపడి ఇంగ్లాండ్​లో ఐసోలేషన్​లో ఉన్న శాస్త్రికి సోమవారం ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో నెగిటివ్​గా తేలితే బుధవారం యూకే నుంచి బయలుదేరుతారు.

IND vs ENG
రవి శాస్త్రి
author img

By

Published : Sep 13, 2021, 9:13 AM IST

టీమ్​ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి (ravi shastri) సహా.. సహాయ సిబ్బంది భరత్ అరుణ్, ఆర్​. శ్రీధర్.. బుధవారం భారత్​ చేరుకునే అవకాశం ఉంది. అయితే వారు నిష్క్రమణ తేదీకి (సెప్టెంబర్​ 15) ముందే రెండు నెగిటివ్ ఆర్​టీ-పీసీఆర్​ రిపోర్ట్​లు సమర్పించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేవని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వారికి సోమవారం ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్​ 8న పాజిటివ్​గా తేలిన జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్​ మాత్రం మరికొన్ని రోజులు ఐసోలేషన్​లోనే ఉండనున్నాడు.

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టుకు ముందు శాస్త్రి కరోనా బారినపడగా (ravi shastri covid) , సెప్టెంబర్​ 4 నుంచి ఐసోలేషన్​లో ఉన్నారు. ఆయన 10 రోజుల క్వారంటైన్​ సోమవారంతో పూర్తవుతుంది. ఈ ముగ్గురూ యూకే నుంచి భారత్​ వెళ్లాక, ఐపీఎల్​ అనంతరం దుబాయ్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​ కోసం టీమ్​ఇండియాతో కలుస్తారు.

ఇదీ చూడండి: IND Vs ENG: ఐదో టెస్టు రద్దుపై రవిశాస్త్రి స్పందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.