ETV Bharat / sports

టీమ్ఇండియాకు షాక్​ - శార్దూల్​కు గాయం!- రెండో టెస్ట్​కు డౌటే! - ind vs sa 2nd test match

Shardul Thakur Injury : భారత్ సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు మరి కొద్ది రోజుల్లో ఆరం భం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ టీమ్ఇండియా నెట్స్​లో తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అయితే ఆ సమయంలో శార్దూల్​ గాయపడ్డాడట. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Shardul Thakur Injury
Shardul Thakur Injury
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 7:42 AM IST

Shardul Thakur Injury : టీమ్ఇండియా స్టార్​ పేసర్​ శార్దూల్‌ ఠాకూర్‌ ఇటీవలే గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్​ చేస్తున్న సమయంలో బాల్ అతడి ఎడమ భుజానికి బలంగా తగిలింది. అయితే ఆ తర్వాత నుంచి శార్దూల్‌ చాలా అసౌకర్యంగా కనిపించాడు. బౌలింగ్‌ కూడా చేయలేదు. కాసేప‌టి త‌రువాత త‌న బ్యాటింగ్​ను కొన‌సాగించాడు. సెష‌న్ ముగిసిన త‌రువాత జట్టు ఫిజియో వ‌చ్చి శార్దూల్ భుజం చుట్టూ ఓ ఐస్ ప్యాక్ బ్యాగ్​ను ఉంచాడు. దీంతో కాసేపు శార్దూల్​ విశ్రాంతి తీసుకున్నాడు. అయితే గాయం తీవ్రత గురించి మాత్రం ఇంకా తెలియదు. రెండో టెస్ట్​ సమయంలో ఇలాంటి గాయం అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోందని నెటిజన్లు అంటున్నారు. అంతే కాకుండా జనవరి 3న ఆరంభమయ్యే రెండో టెస్టుకు అతడు దూరమవుతాడన్న కూడా నెట్టింట మార్మోగిపోతున్నాయి.

ఇక తొలి టెస్టులో శార్దూల్ క్రికెట్ అభిమానులను నిరాశపరిచాడు. 19 ఓవర్లు వేసిన ఈ స్టార్ పేసర్​ ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 101 పరుగులను సమర్పించుకున్నాడు. అంతే కాకుండా అటు బ్యాట్​తోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మ్యాచ్​ సాగిందిలా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియాపై సఫారీలు ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఓవర్‌ నైట్‌ స్కోరు 256/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఎలాగైనా గెలవాలన్న కసితో ఓపెన‌ర్ డీన్ ఎల్గ‌ర్‌ (185) మైదానంలోకి దిగి పరుగుల వరద పారించాడు. మార్కో జాన్‌సేన్‌(84 నాటౌట్)తో క‌లిసి జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. అయితే డ‌బుల్ సెంచ‌రీదిశ‌గా దూసుకెళ్తున్న అత‌డ్ని శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయ‌డం వల్ల భార‌త జ‌ట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వచ్చిన గెరాల్డ్ కోఎట్జీ(18)ను కూడా అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. వెనువెంటనే వచ్చిన ర‌బాడ‌(1), బ‌ర్గ‌ర్‌(0)ల‌ను బుమ్రా ఔట్​ చేసి సఫారీల ఇన్నింగ్స్​కు తెరదించాడు.

బుమ్రా, షమీ తర్వాత ఎవరు?- వారిపై దృష్టి పెట్టాల్సిందే!

'అందుకే ఆ మ్యాచ్​లో సౌతాఫ్రికా గెలిచింది' - టెస్ట్​ రిజల్ట్​పై క్రికెట్​ గాడ్​ రివ్యూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.