ETV Bharat / sports

వార్న్ టాప్-5 బ్యాటర్ల జాబితా.. భారత్ నుంచి ఒక్కరే!

Shane Warne Top Test Batters: తన ఫేవరెట్ టాప్-5 టెస్టు బ్యాటర్ల జాబితా వెల్లడించాడు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్. అందులో టీమ్ఇండియా నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కింది.

shane warne virat kohli, Shane Warne top five Test Batters, షేన్ వార్న్ విరాట్ కోహ్లీ, షేన్ వార్న్ టాప్-5 టెస్టు బ్యాటర్స్
shane warne
author img

By

Published : Dec 13, 2021, 9:33 AM IST

Shane Warne Top Test Batters: ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో తన ఫేవరెట్ టాప్-5 బ్యాటర్లను ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ ఎంపిక చేశాడు. ఆ జాబితాలో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నట్లు వార్న్‌ వెల్లడించాడు. మొదటి స్థానం మాత్రం ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు కేటాయించాడు. స్మిత్ తర్వాత ఇంగ్లాండ్ స్కిప్పర్ జో రూట్‌ ఉన్నాడు. మూడో స్థానంలో నిలకడకు మారుపేరైన కేన్‌ విలియమ్సన్‌ను ఎంచుకున్నాడు. ఐదో స్థానంలో మరో ఆసీస్‌ ఆటగాడు మార్నస్ లబుషేన్ నిలిచాడు.

"సుదీర్ఘకాలంగా అన్ని రకాల బౌలింగ్ దాడిని స్టీవ్‌ స్మిత్‌ ఎదుర్కొంటూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అందుకే స్మిత్‌కు టాప్‌ ర్యాంక్‌. తర్వాత రూట్‌ ఒకే క్యాలెండర్‌ ఇయర్​లో ఆరు శతకాలు బాదాడు. కివీస్‌ సారథి కేన్ నిలకడకు మారుపేరు" అని వివరించాడు వార్న్.

నాలుగో స్థానం విరాట్ కోహ్లీకి, ఐదో స్థానం మార్నస్ లబుషేన్‌కు ఇవ్వడంపైనా షేన్‌ వార్న్‌ వివరణ ఇచ్చాడు. "విరాట్ కోహ్లీ రెండేళ్లుగా పెద్దగా రాణించలేదు. టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడు. అందుకే అతడికే నాలుగో స్థానం ఇచ్చా. అదే విధంగా ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ టాప్‌-5 లోకి వచ్చాడు" అని పేర్కొన్నాడు.

విరాట్‌ నాలుగో స్థానం దక్కించుకోవడం మాత్రం అద్భుతమే. 2019, 2021 సంవత్సరాల్లో కనీసం ఒక్క మూడంకెల స్కోరును సాధించలేదు. అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోయాడు. తర్వాత వన్డే సారథ్యం నుంచి బీసీసీఐ తప్పించింది. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు.

ఇవీ చూడండి: రుతురాజ్​ ప్రేయసి సయాలీ సంజీవ్ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.