ETV Bharat / sports

Shane Warne Funeral: వార్న్​కు ఆత్మీయుల కన్నీటి వీడ్కోలు - మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్

Shane Warne Funeral: ఆస్ట్రేలియా స్పిన్​ దిగ్గజం షేన్​ వార్న్​ అంత్యక్రియలు అతడి స్వస్థలం మెల్​బోర్న్​లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆదివారం జరిగాయి. మార్చి 30న షేన్ వార్న్​​​ స్మారక సభను మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో నిర్వహించనున్నారు.

Shane Warne Funeral
వార్న్​ అంత్యక్రియలు పూర్తి
author img

By

Published : Mar 20, 2022, 10:20 AM IST

Shane Warne Funeral: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్​ అంత్యక్రియలు ఆదివారం మెల్​బోర్న్​లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లు మార్క్ టేలర్​, అలెన్ బోర్డర్​, మైకేల్ వాన్​ సహా 80 మంది హాజరయ్యారు.

మార్చి 30న షేన్ వార్న్​​ స్మారక సభను మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో నిర్వహించనున్నారు. ఈ మైదానం వార్న్​కు చాలా ప్రత్యేకమైనది. 1994లో ప్రతిష్టాత్మక యాషెస్​ సిరీస్​లో హ్యాట్రిక్​, 2006లో బాక్సింగ్​ డే రోజున తీసిన 700వ టెస్ట్​ వికెట్, రిటైర్మెంట్​కు ముందు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇక్కడే ఆడాడు.​ వార్న్​ మెల్​బోర్న్​లోనే పుట్టి పెరిగాడు.

52 ఏళ్ల షేన్ వార్న్​ గుండెపోటుతో మార్చి 4న థాయ్​లాండ్​లోని సముయ్​ ఐస్​లాండ్​లో మరణించాడు. వారం కిందటే వార్న్​ భౌతికకాయాన్ని బ్యాంకాక్​ నుంచి మెల్​బోర్న్​కు తరలించారు.

ఇదీ చదవండి: వార్న్​ మరణంపై వీడిన మిస్టరీ.. పోలీసులు ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.