టీ20 ప్రపంచకప్ (T20 World Cup) కోసం ఎంపిక చేసిన పాకిస్థాన్ జట్టుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది. కొందరు మేటి ప్లేయర్లను ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని తెలిపాడు. అయితే అది తమ దేశ జట్టు (Pakistan T20 World Cup Squad) కాబట్టి తప్పక మద్దతిస్తానని అన్నాడు.
"టీ20 ప్రపంచకప్ కోసం జట్టులోకి కొందరు క్రికెటర్లను ఎందుకు తీసుకున్నారో, మరికొందరిని ఎందుకు వదిలేశారో తెలియడం లేదు. అయితే స్వ్కాడ్‌లో మార్పులకు ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిసింది. నా దృష్టిలో ఇది సరైన జట్టు కాదు. కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది మన (పాక్) జట్టు కాబట్టి దానికి తప్పక మద్దతివ్వాలి."
-షాహిద్ అఫ్రిది, పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఒమన్లలో టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) మ్యాచ్‌లు జరగనున్నాయి. స్వ్కాడ్‌ను ఎంపిక చేసేందుకు అన్ని జట్లకు అక్టోబర్ 10 వరకు సమయం ఉంది. కాబట్టి పాక్ జట్టులోనూ (Pak Team for T20 World Cup) మార్పులు చేర్పులకు అవకాశం లేకపోలేదు. కీలకమైన ఫఖర్ జమాన్, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్ వంటి క్రికెటర్లకు జట్టులో స్థానం లభించలేదు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించిన ఈ జట్టు (Pakistan T20 World Cup Squad) పట్ల కెప్టెన్ బాబర్ అజామ్ కూడా సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్, ఫఖర్ జమాన్, ఆల్ రౌండర్ ఫహీం అష్రాఫ్, లెగ్ స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్‌లను టీ20 ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలని బాబర్.. పీసీబీకి (Pakistan Cricket Board) సూచించినట్లు సమాచారం. కానీ సెలక్షన్ కమిటీ వీరిని పక్కనబెట్టింది.
టీ20 ప్రపంచకప్ కోసం పాక్ జట్టు:
బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హరిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వాసీం, కుష్దిల్ షా, మహమ్మద్ హఫీద్, మహమ్మద్ హస్నేన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ వాసీం, షహీన్ షా అఫ్రిదీ, షోయబ్ మక్సూద్.
కొత్త కోచ్‌ల ఎంపికపై..
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ వెర్నన్ ఫిలాండర్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో తమ జాతీయ జట్టుకు కొత్త కోచ్‌లుగా తీసుకోవాలని ఇటీవలే నిర్ణయించింది పాక్. అయితే ఈ నిర్ణయం టోర్నీ (Shahid Afridi T20 World Cup) అనంతరం తీసుకొని ఉంటే బాగుండేదని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఇదివరకు ఉన్న కోచ్‌లు తమ ఇష్టానుసారం తప్పుకొని ఉన్నట్లు అయితే వారు పాకిస్థాన్ క్రికెట్‌కు అన్యాయం చేసినట్లేనని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన జట్టును (Pakistan T20 World Cup Squad) ప్రకటించిన రోజే ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ రాజీనామా చేశారు.
ఇదీ చూడండి: పీసీబీ కీలక నిర్ణయం.. తటస్థ వేదికల్లో మ్యాచ్‌లకు నో!