న్యూజిలాండ్ టీమ్ బెంచ్ సామర్థ్యంపై తానెంతో సంతృప్తిగా ఉన్నట్లు ఆ దేశ బ్యాట్స్మన్ రాస్ టేలర్(Ross Taylor) అన్నాడు. తమ జట్టులోని బెంచ్, యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారని కితాబిచ్చాడు. అదే విధంగా టీమ్ఇండియాతో ఆడనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం తమ సెలెక్టర్లు సరైన బ్యాకప్ ఎంపికలు చేశారని తెలిపాడు.
"మా జట్టులోని యువ ఆటగాళ్ల ప్రదర్శనకు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ నిదర్శనం. అయితే తుదిజట్టులో బలవంతపు మార్పులు జరిగాయని మీకు తెలుసు. గాయలతో కొంతమంది క్రికెటర్లు సతమతమవుతున్న రొటేషన్ విధానం వల్లే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు సన్నద్ధమవుతున్నాం. అయితే జట్టులో కొంతమంది యువ క్రికెటర్లు ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ దృష్టిలో ఉంచుకొని జట్టులోకి సరైన బ్యాకప్ ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు".
- రాస్ టేలర్, న్యూజిలాండ్ బ్యాట్స్మన్
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్(ENG vs NZ test series)లో భాగంగా జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టులో 6 మార్పులు జరిగాయి. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో కివీస్ విజయానికి చేరువలో ఉంది. ఈ సిరీస్లో కంగారూలు విజయం సాధిస్తే.. ఇంగ్లాండ్ వేదికగా 22 ఏళ్ల తర్వాత దక్కిన విజయం ఇదే కానుంది. మరోవైపు గాయాల కారణంగా టీమ్ఇండియాతో జరగనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) కోసం కివీస్ జట్టులో కొన్ని బలమైన మార్పులు చేయనున్నారని తెలుస్తోంది.
ఇంగ్లాండ్తో తొలి టెస్టు తర్వాత న్యూజిలాండ్ పేసర్లు టిమ్ సౌథీ(Tim Southee), కైలీ జెమిసన్(Kyle Jamieson)లకు విశ్రాంతి ఇవ్వగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) గాయం కారణంగా రెండో టెస్టు నుంచి వైదొలగాడు.
ఇదీ చూడండి: Unadkat: ఆడే అవకాశం ఇంకెప్పుడు వస్తుంది!