ETV Bharat / sports

Saurabh Kumar: టీమ్‌ఇండియా వయా వైమానిక దళం

author img

By

Published : Feb 21, 2022, 7:11 AM IST

Updated : Feb 21, 2022, 7:27 AM IST

Saurabh Kumar Cricketer: ఇటీవల బీసీసీఐ యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంపై ప్రాధాన్యం పెంచింది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్​తో మరో కొత్త ఆటగాడు భారత జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. అతడే సౌరభ్​ కుమార్​. అతడి గురించే ఈ కథనం..

saurabh kumar
సౌరభ్​ కుమార్​

Saurabh Kumar Cricketer: క్రికెట్‌ కోసం వైమానిక దళంలో ఉద్యోగాన్ని వదిలేశాడు.. కోచింగ్‌ కోసం రోజుకు ఏడు గంటల పాటు ప్రయాణించేవాడు.. దేశవాళీలో అదరగొట్టినా జాతీయ జట్టులో స్థానం కోసం చాన్నాళ్లూ వేచి చూశాడు! చివరికి అతడి శ్రమ ఫలించింది.. కల నెరవేరింది! భారత క్రికెట్‌ జట్టులో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అతడే సౌరభ్‌ కుమార్‌. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల ఈ స్లో లెఫ్ట్‌ఆర్మ్‌ బౌలర్‌ త్వరలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడే భారత జట్టుకు ఎంపికయ్యాడు.

బేడీ గుర్తించాడు: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌ జిల్లా బారుట్‌ గ్రామానికి చెందిన సౌరభ్‌ది మధ్య తరగతి కుటుంబం. నాన్న ఆల్‌ఇండియా రేడియాలో పని చేసేవాడు. చిన్నప్పటి నుంచి క్రికెటే లోకంగా ఎదిగిన సౌరభ్‌ కెరీర్‌ను ఓ వేసవి శిక్షణ శిబిరం మలుపు తిప్పింది. ఈ శిబిరానికి వచ్చిన భారత దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ తొలిసారి సౌరభ్‌లో ప్రతిభను గుర్తించాడు. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిందిగా అతడికి సూచించాడు. అయితే తమ గ్రామంలో సరైన క్రికెట్‌ వసతులు లేకపోవడంతో దిల్లీకి వెళ్లి జాతీయ అకాడమీలో ప్రాక్టీస్‌ చేసేవాడు. ఆరంభంలో అతడికి భారత క్రికెట్లో ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి మహిళా కోచ్‌ సునీతా శర్మ కోచింగ్‌ ఇచ్చేది. రోజు ఏడు గంటల పాటు రైలులో ప్రయాణించి వెళ్లి శిక్షణ తీసుకునేవాడు. ఆ తర్వాత యూపీ క్రికెట్‌ తరఫున వయసు విభాగాల్లో మ్యాచ్‌లు ఆడుతూ సత్తా చాటిన సౌరభ్‌.. యూపీ మాజీ వికెట్‌కీపర్‌ మనోజ్‌ ముద్గల్‌ సాయంతో మరింత ఎదిగాడు.

క్రికెట్‌ కోసం ఉద్యోగం వదిలి..: 21 ఏళ్ల వయసులో క్రీడల కోటాలో వైమానిక దళంలో సౌరభ్‌కు ఉద్యోగం వచ్చింది. కొన్నేళ్లు పని చేశాడు. సుఖవంతమైన ఉద్యోగం.. మంచి జీతం.. ఇన్ని ఉన్నా అతడికి సంతృప్తి లేదు. ఎందుకంటే అతడి లక్ష్యం టీమ్‌ఇండియాలో స్థానం. అందుకే ఆ దిశగా సౌరభ్‌ బాగా శ్రమించాడు. బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ మెరుగుపడ్డాడు. వైవిధ్యమైన స్పిన్‌ బౌలింగ్‌కు తోడు లోయర్‌ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్‌ అతడిని ప్రత్యేకమైన ఆటగాడిగా నిలబెట్టింది. రంజీ ట్రోఫీలో సర్వీసెస్‌ తరఫున ఆడుతూ మంచి ప్రదర్శనలు చేశాడు. గత రెండు సీజన్లలోనే ఈ స్పిన్నర్‌ 95 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా 46 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 196 వికెట్లు తీయడంతో పాటు 1572 పరుగులు కూడా చేశాడు. స్థిరంగా రాణిస్తున్న ఈ ఆల్‌రౌండర్‌కు 2020లో ఇరానీ కప్‌లో ఆడే అవకాశం వచ్చినా కొవిడ్‌ కారణంగా టోర్నీ రద్దవడంతో నిరాశే ఎదురైంది. కానీ గతేడాది దక్షిణాఫ్రికా-ఏతో సిరీస్‌లో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆడిన రెండు టెస్టుల్లో సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్‌లోనూ ఒకసారి అతడికి ఛాన్స్‌ వచ్చింది. 2017లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టు రూ.10 లక్షలకు సౌరభ్‌ను దక్కించుకుంది. కానీ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈసారి వేలంలో అతడిని కొనడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు. అయితే ఐపీఎల్‌లో ఆడకపోయినా తాను కొంచెం కూడా బాధపడట్లేదని, టెస్టు మ్యాచ్‌లు ఆడడమే తన కల అని సౌరభ్‌ చెప్పాడు.

ఇదీ చూడండి: విండీస్​తో సిరీస్​ క్లీన్​స్వీప్​.. టీ20ల్లో అగ్రస్థానానికి టీమ్​ఇండియా

Last Updated : Feb 21, 2022, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.