ETV Bharat / sports

టీమ్ఇండియా ఓటమిపై మైక్రోసాఫ్ట్​ సీఈఓ స్పందన- సత్య నాదెళ్ల ఏమన్నారంటే? - వరల్డ్​ కప్ 2023 సత్య నాదేళ్ల

Satya Nadella On India World Cup Loss : వరల్డ్​ కప్​ ఫైనల్​లో టీమ్​​ఇండియా ఓటమిపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Satya Nadella On India World Cup Loss
Satya Nadella On India World Cup Loss
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 6:13 PM IST

Updated : Nov 21, 2023, 9:53 PM IST

Satya Nadella On India World Cup Loss : ఆదివారం జరిగిన 2023 వరల్డ్​ కప్​ ఫైనల్​ మ్యాచ్​పై టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఓ పాడ్​కాస్ట్​లో సత్య నాదెళ్ల మాట్లాడుతుండగా.. షో హోస్ట్​ వరల్డ్‌ కప్‌ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత టీమ్ఇండియా ఓటమిని గుర్తుచేసి.. ఆ ఓటమికి ప్రతీకారంగా 'ఆస్ట్రేలియాను కొంటారా?' అని సరదాగా ప్రశ్నించారు. దీనిపై సత్య నాదెళ్ల స్పందించారు. ఆస్ట్రేలియాను కొనడం అంటే ఓపెన్‌ఏ ఐను సొంతం చేసుకోవడం లాంటిదేనని.. ఆ రెండూ సాధ్యం కావని నవ్వుతూ బదులిచ్చారు. కానీ, ఓపెన్‌ ఏఐతో తాము భాగస్వాములం కాగలమని అన్నారు. అలాగే ఆస్ట్రేలియా క్రికెట్‌ ఆడడాన్నీ ఆనందించగలమని అని సరదాగా బదులిచ్చారు.

అయితే సత్య నాదెళ్ల క్రికెట్‌ అభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా వ్యక్తం చేశారు. 2023 వరల్డ్​ కప్​లో భాగంగా గత బుధవారం న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను రాత్రంతా మేల్కొని మరీ చూసినట్లు తెలిపారు.

అయితే వరల్డ్​ కప్​ ఫైనల్‌ మ్యాచ్‌ను సైతం సత్య నాదెళ్ల వీక్షించారు. ఆస్ట్రేలియా విజయం ఖరారు కాగానే సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఎక్స్‌ వేదికగా ఆ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఎంతో శ్రమించి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టును కూడా అభినందించారు. క్రికెట్‌ గురించి పలు సందర్భాల్లో నాదెళ్ల గతంలో ప్రస్తావించారు. ఈ ఆటే తనకు టీమ్​లో కలిసి పనిచేయడాన్ని, నాయకత్వాన్ని నేర్పించిందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా నియమితులైన సమయంలో చెప్పారు.

ఆదివారం జరిగిన 2023 వరల్డ్​ కప్​ ఫైనల్​లో ఆసీస్​ చేతిలో టీమ్ఇండియా ఓటమిపాలైంది. దీంతో ఆస్ట్రేలియా ఆరో సారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఓటమి తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లతో పాటు యావత్​ దేశం తీవ్ర మనస్తాపానికి గురైంది. బాధలో ఉన్న ప్లేయర్లను డ్రెస్సింగ్​లోకి వెళ్లి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్చారు. కొన్ని సార్లు ఇలా జరుగుతుందని వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

పెళ్లిపీటలెక్కనున్న టీమ్​ఇండియా ప్లేయర్ వెంకటేశ్​ అయ్యర్-​ ఎంగేజ్​మెంట్ ఫొటోలు చూశారా?

క్రికెట్​లో మరో కొత్త రూల్!​- శ్రీలంక నుంచి అండర్​ 19 వరల్డ్ కప్ ఔట్​- కీలక నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ

Last Updated : Nov 21, 2023, 9:53 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.