ETV Bharat / sports

పురుషుల జట్టుకు మహిళా కోచ్.. చరిత్రలో తొలిసారి! - సారా టేలర్ న్యూస్

క్రికెట్​ చరిత్రలో తొలిసారి ఫ్రాంచైజీ క్రికెట్​లో ఓ మహిళా క్రికెటర్​ పురుషుల జట్టుకు కోచ్​గా బాధ్యతలు స్వీకరించనుంది. టీ10 లీగ్ ఐదో సీజన్​​ నేపథ్యంలో ఈ కీలక ప్రకటన చేసింది టీమ్​ అబుదాబి. తమ జట్టుకు అసిస్టెంట్​ కోచ్​గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్​ను(sarah taylor coach) నియమిస్తున్నట్లు ట్వీట్ చేసింది.

sarah taylor
సారా టేలర్
author img

By

Published : Oct 29, 2021, 6:18 PM IST

ఐదో టీ10 లీగ్​ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్​ అబుదాబి చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ పురుషుల క్రికెట్ చరిత్రలో ఓ జట్టుకు తొలిసారిగా మహిళా క్రికెటర్​ను కోచ్​గా నియమిస్తున్నట్లు పేర్కొంది. మాజీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్(sarah taylor coach).. టీమ్​ అబుదాబికి అసిస్టెంట్​ కోచ్​గా ఎంపికైనట్లు ట్విట్టర్​లో వెల్లడించింది.

"చరిత్ర సృష్టించాం. ఐదో సీజన్ టీ10 లీగ్​ నేపథ్యంలో సారా టేలర్​ను అబుదాబి జట్టుకు కోచ్​గా నియమిస్తున్నాం. ఫ్రాంచైజీ క్రికెట్​లో ఓ పురుషుల క్రికెట్​ జట్టుకు మహిళ కోచ్​గా ఎంపికవడం ఇదే తొలిసారి" అని అబుదాబి ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది.

2019లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికింది సారా. తన క్రికెట్ కెరీర్​లో సారా.. ఇంగ్లాండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచ్​లు ఆడింది. ఉత్తమ మహిళా వికెట్ కీపర్ బ్యాటర్​గానూ రాణించింది.

అబుదాబి జట్టులో కీలక ఆటగాళ్లు..

టీమ్​ అబుదాబిలో క్రిస్ గేల్, లివింగ్​స్టోన్, పాల్ స్టిర్లింగ్ వంటి కీలక ఆటగాళ్లున్నారు. వీరితో పాటు లాంగే, మెక్​కాయ్, కొలిన్ ఇంగ్రామ్, డానీ బ్రిగ్స్, ఫైడల్ ఎడ్వర్డ్స్, నవీన్ ఉల్ హక్ ఉన్నారు.

నవంబర్ 19 నుంచి ఈ టీ10 లీగ్ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:

అప్సరసతో రొనాల్డోకు కవలలు.. ఆమె అందం చూస్తే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.