ETV Bharat / sports

చెన్నై కెప్టెన్సీని రిజెక్ట్​ చేసిన సంజూ ? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్​

Sanju Samson Chenanai Super Kings : రాజస్థాన్ జట్టు ప్లేయర్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్​ జట్టులో చేరనున్నాడన్న వార్తలను ఖండిచాడు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన కామెంట్లకు ఆయన స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడు.

Sanju Samson Chenanai Super Kings
Sanju Samson Chenanai Super Kings
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 10:34 PM IST

Updated : Nov 29, 2023, 10:47 PM IST

Sanju Samson Chenanai Super Kings : ఐపీఎల్‌-2024 మిని వేలంకు స‌మ‌యం దగ్గరపడుతున్న తరుణంలో అనేక రూమర్స్​ తెరపైకి వస్తున్నాయి. అయితే వీటిపై ఆయా స్టార్ ఆటగాళ్లు స్పందించని తరుణంలో నెటిజన్లు అవే నిజమనుకుని నమ్ముతున్నారు. తాజాగా సంజూ శాంసన్ విషయంలోనూ అదే జరిగింది. తాజాగా ఈ రాజస్థాన్ ప్లేయర్​ గురించి నెట్టింట ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సంజూకు కెప్టెన్సీకి సంబంధించిన ఆ వార్తలు ఇప్పుడు టాక్ ఆఫ్​ ద టౌన్​గా మారాయి. త్వరలో సంజూ చెన్నై సూపర్ కింగ్స్​ జట్టుకు కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ న్యూస్​ సారంశం. అయితే ఈ విషయాన్ని వెటెరన్​ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​ తన యూట్యూబ్​ ఛానల్​లో చెప్పాడంటూ ఓ యూజర్​ ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

"త‌మ కెప్టెన్‌గా రావాల‌ని చెన్నై సూపర్​ కింగ్స్​ ఫ్రాంచైజీ.. సంజూ శాంస‌న్‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చింది. అందుకు సంబంధించి ప్ర‌ణాళిక‌లను కూడా సిద్ధం చేసింది. అయితే సంజూ ఈ ఆఫ‌ర్‌ను రిజెక్ట్​ చేశాడు. కానీ భ‌విష్య‌త్తులో మాత్రం సంజూను సీఎస్‌కే కెప్టెన్​గా చూడ‌టం ఖాయం" అని అశ్విన్ చెప్పినట్లు ఆ ట్వీట్​లో రాసుంది. అయితే అవన్ని నిజం కావంటూ అశ్విన్ ఆ ట్వీట్​కు రిప్లై ఇచ్చాడు. "ఇవ‌న్నీ అస‌త్య‌పు వార్త‌లు. అబ‌ద్ధాల ప్ర‌చారానికి నా పేరును వాడ‌కండి" అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

అయితే ఇదే విషయంపై సంజూ ఫ్యాన్స్​ కూడా నెట్టింట కామెంట్లు పెడుతున్నారు."రాయ‌ల్స్‌ను విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తున్న సంజూకు ఆ జ‌ట్టును వీడాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ అత‌డు ధోని వార‌సుడిగా చెన్నై జట్టుకు కెప్టెన్ అవ్వాల‌నుకుంటే అందులో త‌ప్పేం లేదు" అని కామెంట్లు చేస్తున్నారు.

Sanju Samson Australia Series : ఇటీవలే ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్​కు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడాన్ని పట్ల పార్లమెంట్​ సభ్యుడు శశి థరూర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇదొక అన్యాయమైన చర్యగా శశి పేర్కొన్నారు. అయితే ఇదే విషయం గురించి సంజూ స్పందించాడు.

"ప్రజలు నన్ను అత్యంత దురదృష్టకరమైన క్రికెటర్ అని పిలుస్తుంటారు. కానీ నాకు మాత్రం అలా అనిపించడం లేదు. ప్రస్తుతం నేను ఏ స్థాయిని చేరుకున్నానో నాకు తెలుసు. అనుకున్నదానికంటే ఇది చాలా ఎక్కువ అని నేను అనుకుంటాను.." అని శాంసన్ అన్నాడు.

శాంసన్​కు మళ్లీ నిరాశే - పరాగ్, అభిషేక్​కూ మొండిచేయి - ఇంకెంత కాలం వెయిటింగ్!

Sanju Samson Australia Series : సంజూ శాంసన్​.. ఇక కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్లేనా ?

Last Updated : Nov 29, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.