ETV Bharat / sports

'బాల్ టాంపరింగ్' వివాదంపై విచారణ హాస్యాస్పదం!

2018లో జరిగిన 'సాండ్​ పేపర్​ గేట్' వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన రీతిలో దర్యాప్తు చేపట్టలేదని విమర్శించాడు డేవిడ్​ వార్నర్​ మేనేజర్​ జేమ్స్​ ఎర్​స్కైన్​. ఆటగాళ్లందరినీ విచారించకుండా ఆసీస్​ బోర్డు ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాడు.

sand paper gate, cricket australia
సాండ్ పేపర్ గేట్, క్రికెట్ ఆస్ట్రేలియా
author img

By

Published : May 17, 2021, 9:00 PM IST

మూడేళ్ల కింద జరిగిన బాల్ టాంపరింగ్‌ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఇప్పుడు మరోసారి కుదిపేస్తోంది. నాటి ప్రధాన సూత్రధారి కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా తాను బంతికి ఉప్పుకాగితం రాయడం తమ బౌలర్లకు కూడా ముందే తెలుసన్నాడు బాన్​క్రాఫ్ట్. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పుడు మరోసారి దానిపై విచారణ చేపట్టింది. అయితే, ఈ విషయంపై ఇంకా ఏదైనా కొత్త సమాచారం ఉంటే తెలియజేయాలని తమ ఆటగాళ్లను కోరింది.

మరోవైపు ఈ ఉదంతం జరిగిన సమయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్​ను ఏడాది పాటు సస్పెండ్​ చేయగా.. ప్రధాన సూత్రధారి కామెరూన్‌ను తొమ్మిది నెలల పాటు ఆటకు దూరం చేసింది. అయితే, ఆస్ట్రేలియా యాజమాన్యం అప్పుడు చేపట్టిన విచారణ హాస్యాస్పదమైందని వార్నర్‌ మేనేజర్ జేమ్స్‌ ఎర్‌స్కైన్‌ తాజాగా విమర్శించాడు. ఆ ముగ్గురికీ శిక్ష వేసినప్పుడు.. వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా కేసు గెలిచేవారన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో విచారణ సందర్భంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లందర్నీ విచారించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని జేమ్స్‌ అభిప్రాయపడ్డాడు.

"అప్పుడు విచారణ సందర్భంగా ఆటగాళ్లందర్నీ విచారించలేదు. ఆ ప్రక్రియను సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. అదో హాస్యాస్పదమైన విషయం. అప్పుడు అసలేం జరిగిందనే విషయం నాకు తెలుసు. అయితే, దాన్ని ఇప్పుడు బయటపెట్టినా ఏ ప్రయోజం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రజలు కొంతకాలం తర్వాత ఆ జట్టును ఇష్టపడటం లేదు. అప్పుడు వార్నర్‌, స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ పట్ల హేయమైన రీతిలో వ్యవహరించారు. వాళ్లు చేసింది తప్పే అయినా, ఆ శిక్ష సరైందికాదు. వాళ్లు గనుక ఆ విషయంలో న్యాయపరంగా వెళ్లి ఉంటే కచ్చితంగా కేసు గెలిచేవారు. ఎందుకంటే నిజం అలాంటిది" అని జేమ్స్‌ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: టీమ్​ఇండియా టెస్టు​​లు ఫిక్సింగ్.. స్పందించిన ఐసీసీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.