ETV Bharat / sports

రోహిత్​ కెప్టెన్సీకి కోహ్లీ ఫుల్ సపోర్ట్.. పాక్ క్రికెటర్ ప్రశంసలు - Salman Butt on Virat Kohli Rohit Sharma captaincy issue

Salman Butt on Kohli Rohit: పరిమిత ఓవర్ల క్రికెట్​లో టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్​గా ఎంపికైన రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ మద్దతు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్. జట్టులో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొనసాగలాంటే రోహిత్‌కు విరాట్ మద్దతు తెలపడం ముఖ్యమని పాక్‌ మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు.

Virat Kohli Rohit Sharma captaincy issue, salman butt on rohit kohli, రోహిత్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం, సల్మాన్ బట్ కోహ్లీ రోహిత్
Rohit Sharma
author img

By

Published : Dec 19, 2021, 10:11 AM IST

Salman Butt on Kohli Rohit: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్‌ శర్మకు.. టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మద్దతు ప్రకటించడం పట్ల పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ సల్మాన్‌ బట్ సంతోషం వ్యక్తం చేశాడు. కొత్త కెప్టెన్‌ రోహిత్ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి జట్టు విజయాల కోసం నిరంతరం కృషి చేస్తానని విరాట్ ఇటీవల పేర్కొన్నాడు. తనకూ, రోహిత్ శర్మకు మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా స్పష్టం చేసినట్లు కోహ్లీ వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన అంశంపై కోహ్లీ వ్యవహరించిన తీరును సల్మాన్‌ మెచ్చుకున్నాడు. జట్టులో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొనసాగలాంటే రోహిత్‌కు విరాట్ మద్దతు తెలపడం ముఖ్యమని పాక్‌ మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు.

ఇద్దరూ మ్యాచ్‌ విన్నర్లే

"వన్డే కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ చాలా తెలివిగా వ్యవహరించాడు. రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరూ భారత జట్టుకు మ్యాచ్ విన్నర్లే. హిట్‌మ్యాన్‌కు విరాట్ మద్దతు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇది జట్టు వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి ఉపకరిస్తుంది" అని బట్ అన్నాడు.

సల్మాన్‌ బట్ మరో విషయాన్ని కూడా ప్రస్తావించాడు. కొన్నేళ్లుగా విదేశాల్లో టీమ్‌ఇండియా విజయాలు సాధించడానికి గల కారణాలను విశ్లేషించాడు. సవాళ్లను ఎదుర్కోవడానికి భారత జట్టు సిద్దమవుతోందని, భారత్‌-ఎ జట్లు విదేశాల్లో పర్యటించడం వల్ల అక్కడి పరిస్థితులపై ఆటగాళ్లు ఓ అంచనాకు వస్తున్నారని వివరించాడు.

ఇవీ చూడండి: 2021లో టాప్-10 వన్డే బ్యాటర్లు వీరే.. భారత్ నుంచి ఒక్కరూ లేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.