ETV Bharat / sports

అంత ఆవేశం వద్దు భాయ్‌!: సచిన్

author img

By

Published : May 24, 2021, 1:22 PM IST

ఓ ఛారిటీ మ్యాచ్​లో నెమ్మదిగా బౌలింగ్​ వేయాలని దిగ్గజ క్రికెటర్​ సచిన్ తనను​ కోరినట్లు తెలిపాడు పాక్​ మాజీ పేసర్​ సయీద్​ అజ్మల్​. ఆటను ఆస్వాదిస్తూ ఆడాలని.. మ్యాచ్​ ఎక్కువ సేపు జరిగితే విరాళాలు మరిన్ని వస్తాయని చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.

Saeed
సచిన్​

ఓ ఛారిటీ మ్యాచ్‌లో దూకుడు తగ్గించి బంతులేయాలని సచిన్‌ కోరినట్టు పాక్‌ మాజీ పేసర్‌ సయీద్‌ అజ్మల్‌ అన్నాడు. ఆటను ఆస్వాదించాలని సూచించాడని తెలిపాడు. పోరు ఎక్కువ సేపు జరిగితే విరాళాలు మరిన్ని వస్తాయని చెప్పాడన్నాడు. వేగంగా బౌలింగ్‌ చేస్తూ వెంటవెంటనే 4 వికెట్లు తీయడంతో మాస్టర్‌ అలా చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.

"అది ఎంసీసీ మ్యాచ్‌. స్నేహపూర్వకంగా జరిగే ఆట. బ్యాట్స్‌మెన్‌ మధ్యలో ఎక్కువసేపు నిలిస్తే విరాళాలు ఎక్కువ వస్తాయి. కానీ ఆట మొదలవ్వగానే నేను 4 వికెట్లు తీశాను. వెంటనే సచిన్‌ నా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. సయీద్ భాయ్‌ మరీ దూకుడుగా ఆడొద్దంటూ నాకు చెప్పాడు. నేను సానుకూలంగా బంతులేస్తున్నానని బదులిచ్చాడు. అది నిజమేనని, దాతృత్వ మ్యాచ్‌ కావడంతో ప్రజలు కాసేపు సమయం గడపాలని కోరుకుంటారని నాకు చెప్పాడు. మ్యాచ్‌ 6:30 లోపు అయిపోవద్దన్నాడు. ఆటను ఆస్వాదిస్తూ సరదాగా ఉండాలని కోరాడు" అని అజ్మల్‌ తెలిపాడు.

2014లో ఎంసీసీ, రెస్టాఫ్ ది వరల్డ్‌ మధ్య ఓ దాతృత్వ మ్యాచ్‌ జరిగింది. రెస్టాఫ్‌ ది వరల్డ్‌ జట్టులో గిల్‌క్రిస్ట్‌, పీటర్సన్‌, యువరాజ్‌, సెహ్వాగ్‌ వంటి ఆటగాళ్లు ఆడారు. మరోవైపు ఎంసీసీలో లారా, ద్రవిడ్‌, సచిన్‌, సయీద్‌ అజ్మల్‌ ఉన్నారు. మ్యాచ్‌ ఆరంభంలోనే అజ్మల్‌ చురకత్తుల్లాంటి బంతులు విసిరి 4 వికెట్లు తీశాడు. దాంతో రెస్టాఫ్ ది వరల్డ్‌ 12 ఓవర్లకే 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఆ తర్వాత యువీ శతకం బాదడంతో 293/7తో నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఎంసీసీ సునాయాసంగా ఛేదించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.