ETV Bharat / sports

పాండ్యాకు కపిల్ చురకలు.. ఏమన్నారంటే?

ఈతరం క్రికెటర్ల మానసిక వైఖరిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు టీమ్ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్. నాలుగు ఓవర్లు వేయగానే బౌలర్లు అలసిపోవడం ఏంటని.. ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యాను ఉద్దేశించి అన్నారు.

kapil, pandya
కపిల్, పాండ్యా
author img

By

Published : Jul 1, 2021, 8:43 PM IST

ఈతరం క్రికెటర్ల మానసిక వైఖరిలో మార్పును టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ ప్రశ్నించారు. ఐతే క్రికెట్‌ పరిణామంలో అది అంగీకార యోగ్యమేనని అన్నారు. నాలుగు ఓవర్లు వేయగానే బౌలర్లు అలసిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

"ఏడాదిలో పది నెలలు క్రికెట్‌ ఆడితే ఎక్కువ గాయపడతారు! కానీ, ఈనాటి క్రికెట్ సులభ స్థాయికి మారింది. బ్యాటు లేదా బంతితో సత్తా చాటితే చాలు. అదే మా తరంలో మేం ఇంకా ఎన్నో చేయాల్సి వచ్చేది. ఈనాటి క్రికెట్‌ మారిపోయింది. కొన్నిసార్లు బౌలర్‌ నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోవడం చూస్తే బాధేస్తోంది. వారికి మూడు, నాలుగు ఓవర్లకు మించి బంతి ఇవ్వడం లేదన్న సంగతి నా చెవిన పడింది. మా తరంలో ఎలా ఉండేదో గుర్తొస్తోంది. అది తప్పో ఒప్పో నేను చెప్పడం లేదు. నెట్స్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చే ఆఖరి ఆటగాడికీ మేం పది ఓవర్లు విసిరేవాళ్లం. అలాంటి వైఖరి అభివృద్ధి చేసుకోవాలి. అలా సాధన చేస్తేనే కండరాలు బలపడతాయి. ఇప్పటి వాళ్లకు నాలుగు ఓవర్లు విసిరితే చాలనిపిస్తోంది. కానీ, మా తరం వాళ్లకి అది కాస్త వింతగా ఉంటుంది".

- కపిల్​ దేవ్​, లెజండరీ క్రికెటర్​

ప్రస్తుతం టీమ్​ఇండియాలో పేస్‌ బౌలింగ్‌ చేసే ఆల్‌రౌండర్‌ లేకపోవడం వల్ల జట్టుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కపిల్‌దేవ్‌ సమర్థంగా ఆ పాత్ర పోషించారు. హార్దిక్‌ పాండ్యా దొరకడం వల్ల మళ్లీ ఆ కొరత తీరిందని సంతోషించారు. గతేడాది వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాక అతడు బౌలింగ్‌ చేయడం లేదు. జట్టు యాజమాన్యం కూడా బంతి ఇచ్చిన రెండు మూడు సార్లు 4 ఓవర్లకు మించి బౌలింగ్‌ చేయనివ్వలేదు.

ఇవీ చూడండి: ధోనీని తలపించిన షెఫాలీ.. ఔటైన తీరుపై వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.