ETV Bharat / sports

'మంచి స్పిన్నర్లు ఎందరో ఉంటారు.. వార్న్​ మాత్రం భిన్నం' - షేన్ వార్న్ సచిన్

Sachin's tribute to Warne: స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్​పై ప్రశంసలు కురిపించాడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్. మైండ్ గేమ్​ ఆడటంలో వార్న్ దిట్ట అని చెప్పుకొచ్చాడు. మంచి స్పిన్నర్లు చాలా మంది ఉంటారని... కానీ వార్న్ చాలా భిన్నమని తెలిపాడు. విండీస్ విధ్వంసక వీరుడు బ్రయన్ లారా సైతం వార్న్​ను గుర్తు చేసుకున్నాడు.

Warne Tendulkar
Warne Tendulkar
author img

By

Published : Mar 29, 2022, 3:55 PM IST

Sachin's tribute to Warne: దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్​పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ క్రికెట్ ప్లేయర్ సచిన్ తెందూల్కర్. వార్న్​ గొప్ప కాంపిటీటర్ అని, అతడిని ఎదుర్కొనేందుకు భిన్నంగా సిద్ధమయ్యేవాడినని సచిన్ చెప్పాడు. మైండ్ గేమ్​ ఆడటంలో వార్న్ దిట్ట అని చెప్పుకొచ్చాడు. మార్చి 4 థాయ్​లాండ్​లో గుండెపోటుతో మరణించిన వార్న్​ మృతి పట్ల సంతాపం తెలిపాడు సచిన్. ఈ సందర్భంగా.. వార్న్​తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

"1998 సిరీస్​లో షేన్ వార్న్​ను నేను ఎదుర్కొన్నా. ఆ సిరీస్​ను 'సచిన్ వర్సెస్ వార్న్' సిరీస్​గా అభిమానులు పిలుచుకునేవారు. ఇది మా ఇద్దరి మధ్య సిరీస్ కాదు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అని నేను చెబుతూ వచ్చా. కానీ ఆ పద ప్రయోగం కొనసాగుతూనే వచ్చింది. వార్న్ బౌలింగ్​ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సిద్ధమయ్యేవాడిని. నెట్స్​లో ప్రాక్టీస్ చేసినప్పుడే కాదు.. గదిలో కూర్చున్నప్పుడు కూడా ఇదే ఆలోచించేవాడిని. అతడి కంటే ఒక అడుగు ముందు ఉండాలని అనుకునేవాడిని. ఎందుకంటే అతడు మన ఆలోచనలను గ్రహించి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తాడు. అలాంటి ప్రపంచ స్థాయి బౌలర్​ను ఎదుర్కొనే సమయంలో కచ్చితంగా ఒత్తిడికి గురవుతాం. అతడి బాడీ లాంగ్వేజీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి బంతినీ అత్యంత కచ్చితత్వంతో వేస్తాడు. మంచి స్పిన్నర్లు చాలా మంది ఉంటారు. కానీ వార్న్ చాలా భిన్నం."
-సచిన్ తెందూల్కర్, భారత మాజీ క్రికెటర్

2021 ఐపీఎల్ సీజన్ తర్వాత వార్న్​ను కలిసిన రోజులను గుర్తు చేసుకున్నాడు సచిన్. లండన్​లో అతడితో కలిసి మాట్లాడినట్లు తెలిపాడు. 'ఎప్పుడు కలిసినా.. పూర్తి ఎనర్జెటిక్​గా ఉంటాడు. ఎప్పుడూ జోక్​లు వేస్తుంటాడు. జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. అతడు లేడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. కానీ, వార్న్ మన గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాడు' అని సచిన్ చెప్పుకొచ్చాడు.

వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారా సైతం వార్న్​ను ఆకాశానికెత్తాడు. ప్రపంచ క్రికెట్​లో ఉన్నత స్థాయి దిగ్గజాల సరసన వార్న్ చోటు సంపాదించుకున్నాడని లారా పేర్కొన్నాడు. 'నేను స్పిన్ బాగా ఆడే ప్రాంతం నుంచే వచ్చా. వార్న్ తన స్పిన్ మాయాజాలంతో ఎంతో మంది ప్లేయర్లను ఇబ్బంది పెట్టాడు. మా ఇద్దరి మధ్యా రసవత్తరమైన పోరాటాలు జరిగాయి. అందులో నేనే గెలిచా అని అనుకునేవాడిని. కానీ వార్న్ ఎప్పుడూ వెనక్కి తగ్గడు. మనం ఊహించలేని బంతులు వేయడం అతడి ప్రత్యేకత' అని చెప్పాడు లారా.

సంతాప సభ...: బుధవారం మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్​లో వార్న్ సంతాప సభ నిర్వహించనున్నారు. ప్రముఖుల సందేశాలను ఇక్కడ వినిపించనున్నారు. సంగీత కళాకారుడు ఎడ్ షీరన్, ఎల్టన్ జాన్, రాబీ విలియమ్స్ వంటి ప్రముఖులు వార్న్ మృతి పట్ల సంతాపం తెలిపారు. 50 వేల మందికి పైగా ప్రజలు బుధవారం జరిగే కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'ఆర్సీబీ నన్ను అడగలేదు.. వైదొలిగాక కోహ్లీ అలా అన్నాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.