ETV Bharat / sports

ఈ చిత్రంలో ఎన్ని పరుగులు, వికెట్లు ఉన్నాయో చెప్పగలరా?: సచిన్‌ - సచిన్ తెందుల్కర్​ లేటెస్ట్ న్యూస్​

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్​లో భాగంగా టీమ్​ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్​ ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ చిత్రంలో ఎన్ని పరుగులు, వికెట్లు ఉన్నాయో చెప్పగలరా? అంటూ ప్రశ్నించాడు. ఆ ఫొటోకు విపరీతంగా లైక్స్​, కామెంట్స్ వస్తున్నాయి.

sachin
సచిన్
author img

By

Published : Sep 16, 2022, 3:12 PM IST

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్​లో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. మైదానంలోకి దిగి తనదైన షాట్లను ఆడుతూ ఒకప్పటి మాస్టర్‌ బ్లాస్టర్‌ను గుర్తుచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు టోర్నీలోని తన సహచర ఆటగాళ్లతో కలిసి విమానంలో ప్రయాణించిన రెండు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. వీరిలో సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ సచిన్‌ పక్కనే కనిపించాడు. వీటిని పోస్టు చేస్తూ.. 'ఈ చిత్రాల్లో ఎన్ని అంతర్జాతీయ పరుగులు, వికెట్లు ఉన్నాయో చెప్పగలరా..?' అని సచిన్‌ ప్రశ్నించాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. విమానంలో బ్రెట్‌లీ, షేన్‌ వాట్సన్‌తో సహా శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ దేశాల మాజీ క్రికెటర్లు ఉన్నారు.

అంతర్జాతీయ మాజీ దిగ్గజాలతో ఈ రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ రెండో సీజన్‌ ఈ నెల 10న కాన్పూర్‌లో ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సచిన్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ జట్టు దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ను ఓడించింది. ఇక ఇండియా లెజెండ్స్‌ జట్టులో యువరాజ్‌సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యుసుఫ్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌, మునాఫ్‌ పటేల్‌, స్టువర్ట్‌ బిన్నీ, బద్రీనాథ్‌, నమన్‌ ఓజా, ప్రజ్ఞాన్‌ ఓజా ఉన్నారు.

ఇదీ చూడండి: ముంబయి కొత్త​ కోచ్​గా మార్క్​ బౌచర్.. పంజాబ్​ జట్టుకు ట్రెవర్ బైలిస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.