ETV Bharat / sports

Sachin Tendulkar Statue : సచిన్​కు అరుదైన గౌరవం.. నిలువెత్తు విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే? - వాంఖడే స్టేడియంలో సచిన్ తెందూల్కర్ స్టాండ్

Sachin Tendulkar Statue Wankhede Stadium : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​కు అరుదైన గౌరవం దక్కనుంది. నవంబర్ 1న ముంబయి వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్​సీఏ (ముంబయి క్రికెట్ ఆసోసియేషన్) తెలిపింది.

Sachin Tendulkar Statue
Sachin Tendulkar Statue
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 7:17 PM IST

Sachin Tendulkar Statue Wankhede Stadium : క్రికెట్ దిగ్గజం, భారతరత్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​కు అరుదైన గౌరవం దక్కనుంది. నవంబర్ 1న సచిన్ హోం గ్రౌండ్​ ముంబయి వాంఖడే స్టేడియంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఆధ్యక్షుడు అమోల్ కాలే వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సచిన్ తెందూల్కర్​తో పాటు భారత క్రికెట్​ జట్టు సభ్యులు, సిబ్బంది తదితరులు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తెందూల్కర్​ స్టాండ్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్​కు ముంబయి వాంఖడే స్టేడియంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడు ఈ మైదానంలో క్రికెట్ ఆడినా.. పెద్ద ఎత్తున అభిమానుల సపోర్ట్ ఉండేది. ఇప్పటికే ఈ స్టేడియంలో ఆయన పేరిట 'సచిన్ రమేశ్ తెందూల్కర్' స్టాండ్ ఉంది. ఇప్పుడు తాజాగా ఈ స్టాండ్ పక్కనే విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదితో సచిన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఈ విధంగా తెందూల్కర్​ను స్టేడియం నిర్వాహకులు గౌరవించనున్నారు.

వాంఖడేతో తెందూల్కర్ అనుబంధం.. సచిన్ సొంత రాష్ట్రం మహారాష్ట్ర కావడం వల్ల ముంబయి వాంఖడేతో అనుబంధం ఏర్పడింది. సెంట్రల్ ముంబయి దాదర్​లోని శివాజీ పార్క్​లో ఆయన గురువు రామాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ తీసుకునేవారు. సచిన్ చిరకాల స్వప్నం ప్రపంచకప్​ కల నెరవేరింది కూడా ఈ మైదానంలోనే. 2011 వరల్డ్​కప్​ శ్రీలంకతో.. భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది ఇక్కడే. ఆ తర్వాత రెండేళ్లకు సచిన్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిందీ ముంబయి వాంఖడేలోనే. ఆయన వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​తో ఆటకు గుడ్​బై చెప్పారు.

Sachin Tendulkar Stats : సచిన్ తెందూల్కర్ కెరీర్​లో 664 అంతర్జాతీయ (200 టెస్టు, 463 వన్డే, 1 టీ20) మ్యాచ్​లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 34357 పరుగులు చేశారు. ఇక క్రికెట్ చరిత్రలో 100 శతకాలు నమోదు చేసిన ఘనత కూడా తెందూల్కర్​దే. ఆయన టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 శతకాలు బాదారు. ఈ లిస్ట్​లో సచిన్ తర్వాత టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 78 అంతర్జాతీయ శతకాలున్నాయి.

Golden Ticket World Cup 2023 : సచిన్ తెందూల్కర్​​కు 'గోల్డెన్' టికెట్.. ఏంటి దీని ప్రత్యేకత?

'నేషనల్​ ఐకాన్'​గా సచిన్ తెందుల్కర్.. దేశం కోసం సెకెండ్ ఇన్నింగ్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.