Sachin Tendulkar Rewinds Childhood: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్.. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన గురించి, క్రికెట్ గురించి పోస్ట్‌లు పెడుతుంటారు. ఇప్పుడు కూడా సచిన్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోమవారం.. తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ చేశాడు. ఒక్కసారిగా బస్సెక్కి బాల్యంలోకి వెళ్లిపోయాడు. ఇదంతా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. శివాజీ పార్క్‌కు వెళ్లే బస్సు ఫుట్‌బోర్డుపై నిలబడి సచిన్ దిగిన ఫొటో ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
''తిరిగి బాల్యంలోకి'' అనే శీర్షికతో సచిన్ ఈ ఫొటోను సోమవారం పోస్టు చేశాడు. చిన్నతనంలోనే క్రికెట్ మొదలెట్టిన అతను.. ప్రాక్టీస్, మ్యాచ్‌ల కోసం ముంబయి బస్సుల్లో ప్రయాణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జ్ఞాపకాలను మరోసారి మాస్టర్ బ్లాస్టర్ నెమరేసుకున్నాడు. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్.. ఎన్నో రికార్డులు సొంతం చేసుకొని తిరుగులేని రారాజుగా అవతరించాడు. 200 టెస్టులు ఆడి 53.78 సగటుతో 15 వేల 921 పరుగులు చేశాడు. వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ అత్యధిక స్కోరు సచిన్‌దే కావడం విశేషం. వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ కూడా తెందుల్కరే.
ఇవీ చూడండి: టీమ్ఇండియా యువ క్రికెటర్‌పై శాస్త్రి సంచలన వ్యాఖ్యలు