ETV Bharat / sports

ఆ ప్లేయర్​కు సచిన్ గట్టి వార్నింగ్​.. అలా చేసినందుకు - sachin warning to player

మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ అభిమానులకు ఆయన ఆట అంటే ఎంత ఇష్టమో ఆయన యాటిట్యూడ్ అన్న​ కూడా అంతే ఇష్టం. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఈ దిగ్గజ క్రికెటర్​కు.. మైదానంలో ఓ జూనియర్​ ప్లేయర్​ విషయంలో కోపం వచ్చిందట. అది ఎందుకంటే..

sachin tendulkar angry on junior
sachin tendulkar
author img

By

Published : Dec 21, 2022, 4:47 PM IST

Updated : Dec 21, 2022, 5:47 PM IST

సచిన్ తెందూల్కర్.. క్రికెట్ అభిమానులు దేవుడిగా కొలిచే ఆటగాడు. మ్యాచ్​ ఏదైనా సరే అతడు బరిలోకి దిగాడంటే ఇక అంతే.. రైవల్​ టీమ్​కు హడలే. అలా వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఇప్పటికీ ఈయనదే రికార్డు. తన కెరీర్‌లో ఎన్నో సెంచరీలు సాధించిన మన మాస్టర్ రికార్డుల చిట్టా మామూలుగా ఉండదు. ఎంత ఒత్తిడి ఉన్నా మైదానంలో మాత్రం ఆచితూచి ఆడే సచిన్.. ​ ఓ సారి మైదానంలో తన జూనియర్​కు గట్టి వార్నింగ్ ఇచ్చాడట. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు.

"నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఓ సారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాం. జూనియర్ ప్లేయర్లలో ఒకరికి అదే తొలి మ్యాచ్. అయితే క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోట ఆ కుర్రవాడు ఆడుతున్నాడు. అప్పుడు సింగిల్ ఇవ్వాల్సిన చోట రెండు పరుగులు ఇచ్చాడు. కాబట్టి ఓవర్ అయ్యాక ప్రశాంతంగా అతడిని పిలిచాను. తన భుజంపై చేయి వేసి గట్టి వార్నింగ్ ఇచ్చాను. ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను ఇంటికి పంపిస్తాను. హోటెల్‌కు వెళ్లకుండానే నేరుగా భారత్‌కు వెళ్తావ్ అని మందలించాను" అని సచిన్ తెలిపాడు. జాతీయ జట్టు తరఫున ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడాలని సచిన్ సూచించారు. "భారత్ తరఫున ఆడుతున్నప్పుడు ఏ విషయంలోనూ మీరు రాజీ పడకూడదు. ఎందుకంటే ఇది చాలా అరుదుగా దొరికే గౌరవం. నీ స్థానం కోసం లక్షలాది మంది చూస్తుంటారు. అందుకే దీన్ని తేలీకగా తీసుకోకూడదు."అని స్పష్టం చేశారు.

Last Updated : Dec 21, 2022, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.