ETV Bharat / sports

SA vs IND: 'కోహ్లీ కోలుకున్నాడు.. మూడో టెస్టుకు రెడీ'

SA vs IND: దక్షిణాఫ్రికాతో మూడోటెస్టు ఆడేందుకు టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని ప్రస్తుత కెప్టెన్​ కేఎల్ రాహుల్ అన్నాడు. నెట్స్​లో ఫిట్​నెస్​పై కసరత్తులు చేస్తున్నాడని వివరించాడు.

Virat Kohli rahul
విరాట్ కోహ్లీ రాహుల్
author img

By

Published : Jan 7, 2022, 7:54 AM IST

Updated : Jan 7, 2022, 9:24 AM IST

SA vs IND: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆడేందుకు టీమ్ఇండియా కెప్టెన్​ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని ప్రస్తుత కెప్టెన్​ కేఎల్ రాహుల్ చెప్పాడు. నెట్స్​లో కోహ్లీ.. ఫీల్డింగ్, బ్యాటింగ్​ ప్రాక్టీస్ చేస్తున్నాడని వివరించాడు. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు జట్టు సారథి కోహ్లీ.

"విరాట్ ఇప్పటికే కోలుకున్నాడు. గతరెండు రోజులుగా ఫిట్​నెస్​పై కసరత్తులు చేస్తున్నాడు. మూడో టెస్టుకు సిద్ధంగా ఉంటాడు." అని ప్రస్తుత కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్​ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. తర్వాత రెండో టెస్టు కూడా ఆడాడు సిరాజ్. కాగా.. సిరాజ్​ గాయంపైనా రాహుల్ స్పందించాడు.

"ప్రస్తుతం సిరాజ్​ పర్యవేక్షణలో ఉన్నాడు. గాయమైనా సరే రెండో టెస్టు ఆడటం సవాల్​తో కూడుకున్నది. ఉమేశ్, ఇషాంత్​లు ప్రస్తుతం ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండో టెస్టు ఓటమి తర్వాత మేం మరింత ఆకలితో ఉన్నాం" అని రాహుల్ అన్నాడు.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బాక్సింగ్ డే టెస్టులో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన టీమ్ఇండియా.. జోహన్నెస్​బర్గ్ టెస్టులో మాత్రం ఓటమిపాలైంది. ​రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 240 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆ జట్టు.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో నాటౌట్​గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చూడండి: IND vs SA Test: ఎల్గర్​ కెప్టెన్​ ఇన్నింగ్స్- రెండో టెస్టులో భారత్​ ఓటమి

Last Updated : Jan 7, 2022, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.