SA vs AFG World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా ఏడో విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో తలపడ్డ సఫారీ జట్టు.. 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అఫ్గాన్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో సౌతాఫ్రికా ఛేదించింది. బ్యాటర్లు రస్సీ వాన్‌డర్ డస్సెన్ (76 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా.. ఓపెనర్ క్వింటన్ డికాక్ (41), పెహ్లుక్వాయో (39) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2, ముజీబ్ అర్ రహ్మన్ 1 వికెట్ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్‌డర్ డస్సెన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా.. టోర్నీలో 7 విజయాలతో పాయింట్ల పట్టకలో రెండో స్థానంతో లీగ్ దశను ముగించగా.. 4 విజయాలతో పట్టికలో ఆరో స్థానంతో టోర్నీ నుంచి అఫ్గాన్ నిష్క్రమించింది.
-
A fantastic 76* helps Rassie van der Dussen win the @aramco #POTM 👌#CWC23 | #SAvAFG pic.twitter.com/wN7EcuGE8w
— ICC (@ICC) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A fantastic 76* helps Rassie van der Dussen win the @aramco #POTM 👌#CWC23 | #SAvAFG pic.twitter.com/wN7EcuGE8w
— ICC (@ICC) November 10, 2023A fantastic 76* helps Rassie van der Dussen win the @aramco #POTM 👌#CWC23 | #SAvAFG pic.twitter.com/wN7EcuGE8w
— ICC (@ICC) November 10, 2023
245 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సఫారీలకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు డికాక్, బవూమా (23 పరుగులు) తొలి వికెట్‌కు 10.6 ఓవర్లలో 64 పరుగులు జోడించారు. స్పిన్నర్ ముజీబ్ ఈ జోడీని విడగొట్టాడు. అనంతరం వన్ డౌన్లో వచ్చిన డస్సెన్ స్కోర్ బోర్డను ముందుకు నడిపించాడు. ఇక మర్క్రమ్ (25), క్లాసెన్ (10), మిల్లర్ (24) తక్కువ స్కోర్లకే ఔటనప్పటికీ.. పెహ్లుక్వాయోతో కలిసి డస్సెన్ సౌతాఫ్రికాను గెలిపించాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (97*; 107 బంతుల్లో 7×4, 3×6) అద్భుతంగా రాణించాడు. మిగత బ్యాటర్లు గుర్భాజ్ (25), జర్దాన్ (15), రహ్మత్ షా (26), హష్మతుల్లా షాహిది (2), ఇక్రామ్ అలిఖిల్ (12), మహమ్మద్ నబీ (2), రషీద్ ఖాన్ (14), నూర్ అహ్మద్ (26), ముజీబ్ (8), నవీన్ ఉల్ హక్ (2) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ 4 , కేశవ్ మహరాజ్ 2, లుంగి ఎంగిడి 2, ఫెహ్లూక్వాయో ఒక వికెట్ తీశాడు.
-
RASSIE LEADS PROTEAS CHASE 👏
— Proteas Men (@ProteasMenCSA) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Brilliant batting Rassie van der Dussen to steer the Proteas to a win over Afghanistan 🇿🇦🇦🇫
On to the semis we going ➡️ #CWC23 #BePartOfIt #SAvAFG pic.twitter.com/aR5OsOQo8V
">RASSIE LEADS PROTEAS CHASE 👏
— Proteas Men (@ProteasMenCSA) November 10, 2023
Brilliant batting Rassie van der Dussen to steer the Proteas to a win over Afghanistan 🇿🇦🇦🇫
On to the semis we going ➡️ #CWC23 #BePartOfIt #SAvAFG pic.twitter.com/aR5OsOQo8VRASSIE LEADS PROTEAS CHASE 👏
— Proteas Men (@ProteasMenCSA) November 10, 2023
Brilliant batting Rassie van der Dussen to steer the Proteas to a win over Afghanistan 🇿🇦🇦🇫
On to the semis we going ➡️ #CWC23 #BePartOfIt #SAvAFG pic.twitter.com/aR5OsOQo8V
SL vs AFG World Cup 2023 : శ్రీలంకపై అఫ్గాన్ ఘన విజయం.. వరల్డ్ కప్‌లో ముచ్చటగా మూడో గెలుపు
మెగాటోర్నీలో అఫ్గానిస్థాన్ హ్యాట్రిక్ విక్టరీ, చిత్తుగా ఓడిన నెదర్లాండ్స్