Ruturaj Gaikwad Vijay Hazare Trophy: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2021లో మహారాష్ట్ర జట్టుకు సారథిగా ఉన్న గైక్వాడ్ వరుసగా మూడు సెంచరీలు బాదాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో 129 బంతుల్లో 124 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.
ఈ మ్యాచ్‌లో రుతురాజ్ 9 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. రుతురాజ్‌కు తోడుగా రాహుల్ త్రిపాఠి(99) రాణించాడు. దీంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.
తొలుత మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగులు, ఛత్తీస్‌గఢ్‌పై 154 పరుగులు చేశాడు రుతురాజ్.
సీఎస్కేలో కీలకంగా..
ఐపీఎల్ 14వ సీజన్ టైటిల్‌ను సీఎస్కే సొంతం చేసుకోవడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించాడు. 635 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగు అర్ధసెంచరీలు, ఓ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం సీఎస్కే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలోనూ రుతురాజ్ ఉన్నాడు.
ఇదీ చదవండి:
'కొందరు నాకు పని లేకుండా చేయాలని చూశారు'
IND vs SA Series: నెట్స్‌లో రోహిత్, షమీ.. సౌతాఫ్రికా సిరీస్ కోసం రెడీ!