ETV Bharat / sports

పెళ్లి తర్వాత ఫస్ట్​ మ్యాచ్‌.. 22 బంతుల్లోనే రుతురాజ్​​ హాఫ్ సెంచరీ.. 5 సిక్సులతో బీభత్సం! - Ruturaj Gaikwad updates

Ruturaj Gaikwad MPL : చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటుతున్నాడు. కొల్హపూర్ టస్కర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. 22 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ సాధించాడు.

ruturaj
ruturaj
author img

By

Published : Jun 16, 2023, 7:34 PM IST

Updated : Jun 16, 2023, 7:39 PM IST

Ruturaj Gaikwad MPL : ఐపీఎల్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా గైక్వాడ్ చెలరేగిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో స్టాండ్ బై ప్లేయర్‌గా అతను లండన్ వెళ్లాల్సింది. కానీ తన పెళ్లి ఉండటంతో ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

అశ్విన్​ అక్కడ.. రుతురాజ్​ ఇక్కడ..
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్​ తర్వాత భారత జట్టుకు నెల రోజుల విశ్రాంతి దొరికింది. దీంతో అశ్విన్ వంటి వెటరన్లు కూడా ఆటకు దూరం అవ్వకూడదని లోకల్ లీగ్స్‌లో ఆడుతున్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ కూడా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటుతున్నాడు.

Ruturaj Gaikwad Innings : ఇటీవలే పెళ్లి చేసుకున్న అతడు.. ఈ లీగ్‌లో పుణెరి బప్పా టీమ్​కు ఆడుతున్నాడు. కొల్హపూర్ టస్కర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పుణెరి టీమ్​ ముందు 145 పరుగుల టార్గెట్ నిలిపింది. ఓపెనర్‌గా బరిలో దిగిన రుతురాజ్ ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో రాణించిన అతడు కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో పుణెరి సూపర్​ విక్టరీ సాధించింది. ఇంకా 29 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లతో విజయం సాధించింది.

వెస్టిండీస్​ టూర్​కు..
Ruturaj Gaikwad Team India : రుతురాజ్ గైక్వాడ్​ సూపర్ ఫామ్‌లో ఉండటంతో కొన్ని రోజుల్లో మొదలయ్యే వెస్టిండీస్ టూర్‌లో అతడిని కూడా సెలెక్ట్ చేయాలని కొందరు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకా ఆ సిరీస్‌కు సంబంధించిన టీమ్​ సెలెక్షన్ విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రాలేదు.

రుతురాజ్​ X యశస్వి
India Vs West Indies Tour : వెస్డిండీస్​తో జరగబోయే సిరీస్‌లో రోహిత్ శర్మకు కొన్ని మ్యాచుల్లో విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఒక ఓపెనర్ ప్లేస్ జట్టులో ఖాళీ అవ్వనుంది. దీని కోసం రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ పోటీ పడతారని తెలుస్తోంది. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో అన్ని ఫార్మాట్లలో ఒక ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ తన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రెండో స్థానం కోసం రుతురాజ్​, యశ్వసి పోటీ పడనున్నారు!

Last Updated : Jun 16, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.