టీమ్ఇండియాను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ ఇలాగే దూరం కాగా.. ఇప్పుడు టీ20 సిరీస్‌కు మరో క్రికెటర్ దూరం కానున్నాడు. మణికట్టు గాయానికి గురైన రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీలో రిహ్యాబిలిటేషన్ కోసం వెళ్లాడు. దీంతో ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. కాగా చివరిసారి గైక్వాడ్.. మహారాష్ట్ర, హైదరాబాద్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడాడు. అయితే ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు కేవలం 8, 0 రన్స్ మాత్రమే చేయగలిగాడు.
గతేడాది కూడా ఇలాగే మణికట్టు గాయంతో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌కు రుతురాజ్ దూరమయ్యాడు. ఇక కొవిడ్ బారిన పడి వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ కూడా ఆడలేకపోయాడు. దీంతో వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రుతురాజ్ సిరీస్‌కు దూరమవ్వడంతో ఇప్పుడు పృథ్వీ షాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు మెరుగయ్యాయని సమాచారం.
కాగా, ఇటీవలే ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోష్‌లో ఉన్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌తో జనవరి 27నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. రాంచీ వేదికగా తొలి టీ20లో తలపడనుంది. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి రుతురాజ్ తప్పుకోవడంతో టీమ్ఇండియా ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది.
భారత జట్టు(అంచనా).. హార్ధిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, చాహల్, ముకేశ్ కుమార్
న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రాస్ వెల్, డారల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, మార్క్ చాప్‌మన్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డేన్ క్లీవర్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్ డఫ్ఫీ, బెన్ లిస్టర్, ఐష్ సోదీ, లోకీ ఫెర్గూసన్, హెన్రీ షిప్లే, బ్లెయిర్ టిక్నర్