ETV Bharat / sports

రాస్ టేలర్​ మరో రికార్డు.. ఆ జాబితాలో తొలిస్థానం

Ross Taylor Record: న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్ టెస్టు క్రికెట్​లో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో బరిలో దిగడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఆ రికార్డు ఏంటంటే?

Ross Taylor Test record, రాస్ టేలర్ టెస్టు రికార్డు
Ross Taylor
author img

By

Published : Jan 9, 2022, 10:18 AM IST

Ross Taylor Record: న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్ టెస్టు క్రికెట్​లో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో బరిలో దిగిన ఇతడు.. సుదీర్ఘ ఫార్మాట్​లో అత్యధిక మ్యాచ్​లు ఆడిన న్యూజిలాండ్ క్రికెటర్ల జాబితాలో తొలి స్థానానికి చేరాడు. ఈ క్రమంలోనే వెటోరి పేరిట ఉన్న 112 మ్యాచ్​ల రికార్డును సమం చేశాడు. కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 111 మ్యాచ్​లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇదే చివరి టెస్టు

బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టు కెరీర్​లో రాస్ టేలర్​కు చివరిది. ఈ మ్యాచ్ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్​కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు టేలర్. దీంతో ఈ మ్యాచ్​ను విజయంతో ముగించి అతడికి అంకితమివ్వాలని కివీస్ ఆటగాళ్లు భావిస్తున్నారు.

ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్​.. కివీస్​కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు విల్ యంగ్ (54), టామ్ లాథమ్ జట్టుకు శుభారంభాన్నిచ్చారు. యంగ్ ఔటైనా.. లాథమ్ కెప్టెన్ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. భారీ శతకం (160*) బాది క్రీజులో ఉన్నాడు. డేవిడ్ కాన్వే (71*) ఇతడికి మద్దతుగా నిలిచాడు. దీంతో 80 ఓవర్లలో వికెట్ నష్టానికి 300 పరుగులు చేసింది కివీస్.

ఇవీ చూడండి: కరోనా సోకిన మరునాడే టోర్నీలో.. జకోవిచ్ తీరుపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.