భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 38 పరుగులే చేశాడు. దీంతో బీసీసీఐ.. వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడిని మిగిలిన రెండు టెస్టులకు ఆ బాధ్యతల నుంచి తప్పించింది. కేవలం ఆటగాడిగా జట్టులో కొనసాగించింది.
అయితే ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు చోటు ఇవ్వాలని క్రికెట్ అభిమానులు, మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. అది పెద్ద విషయమేమి కాదని పేర్కొన్నాడు.
మూడో టెస్టు ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. "టీమ్‌లోని మొత్తం 17 మంది ప్లేయర్లకు అవకాశం ఉంది. టాలెంట్ ఉన్న ప్లేయర్స్‌కు టీమ్ మద్దతు ఎప్పుడూ ఉంటుంది. వైస్ కెప్టెన్సీని తొలగించడం పెద్ద విషయం ఏమీ కాదు. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన సమయంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు. అందుకే కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అసలు ఇదంతా పెద్ద విషయం కాదు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
రాహుల్ గత పది ఇన్నింగ్స్.. గత మూడు ఇన్నింగ్స్‌లో కే ఎల్ రాహుల్.. 71 బంతుల్లో 20 పరుగులు.. 41 బంతుల్లో 17 పరుగులు.. 3 బంతుల్లో ఒక్క పరుగు చేసి నిరాశపరిచాడు. అసలు ఈ మూడు మాత్రమే కాదు గత పది ఇన్నింగ్స్‌లలోనూ ఇలాంటి చెత్త ప్రదర్శనే చేశాడు. ఒక్క అర్ధ శతకం కూడా బాదలేదు. ఈ పది ఇన్నింగ్స్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 23 పరుగులే. అదీ కూడా బంగ్లాదేశ్‌పై ఆడాడు. అందుకే కేఎల్ రాహుల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అందుకే బోర్డు అతడిని వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది జట్టులో మాత్రమే కొనసాగించింది.
కాగా, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా రీసెంట్గా జరిగిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది టీమ్ఇండియా. ఇక మూడో మ్యాచ్‌లోనూ కంగారులను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా ఈ మూడో టెస్టు మొదలుకానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ కూడా చేశాయి.
ఇదీ చూడండి: కేెఎల్ రాహుల్‌కు హెచ్చరిక.. ఇకనైనా సరిచేసుకుంటాడా?