ETV Bharat / sports

Rohith Sharma Bowling : బంతి పట్టిన హిట్​మ్యాన్​.. అశ్విన్ ఆధ్వర్యంలో.. - వన్డే వరల్డ్ కప్​ 2023 రోహిత్ శర్మ బౌలింగ్​

Rohith Sharma Bowling  ODI World Cup 2023 : టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ బంతిని పట్టాడు. అశ్విన్​ మార్గదర్శకత్వంలో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియో చూశారా?

Rohith Bowling : బంతి పట్టిన హిట్​ మ్యాన్​..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 7:39 AM IST

Updated : Oct 18, 2023, 7:47 AM IST

Rohith Sharma Bowling ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్​ 2023లో భాగంగా.. గురువారం(అక్టోబర్ 19) బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఆడనుంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలో మ్యాచ్​కు ముందు భారత జట్టు నెట్స్‌లో శ్రమిస్తూ కనిపించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, ప్రధాన పేసర్లు బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తదితరులు నెట్స్‌లో శ్రమించారు.

రన్‌మెషీన్‌ కోహ్లీ ల్యాప్‌, స్వీప్‌ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించగా.. కెప్టెన్​ హిట్​ మ్యాన్​ బంతితో రంగంలోకి దిగడం విశేషం. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమ్​ఇండియా సీనియర్​ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మార్గదర్శకంలో రోహిత్​ బౌలింగ్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బంగ్లాదేశ్‌ జట్టు నలుగురు ఎడమచేతి వాటం గల బ్యాటర్లతో ఆడుతున్న నేపథ్యంలో.. అదనపు స్పిన్నర్‌ అవసరం లేకుండా టీమ్​ఇండియా ప్రణాళికలను రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్​ బంగ్లాతో మ్యాచ్‌లో తుది జట్టులో లేకపోతే.. రోహిత్‌ బౌలింగ్​ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అయిన రోహిత్‌ శర్మ.. ఐపీఎల్​లో హ్యాట్రిక్‌ కూడా నమోదు చేశాడు. అయితే భుజానికి గాయమైనప్పటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో అతడు ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన సందర్భాలు ఎక్కడా కనిపించలేదు. వన్డేల్లో చివరిగా పెర్త్‌ వేదికగా 2016లో ఆస్ట్రేలియాపై హిట్​మ్యాన్​ బౌలింగ్ చేశాడు. అయితే, 2021లో ఇంగ్లాండ్​తో టెస్టు మ్యాచ్​లో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. టీ20లలో ఆఖరిగా 2012లో బంతులను సంధించాడు.

కాగా, రీసెంట్​గా ముగిసిన ఆసియా వన్డే కప్‌-2023లో టీమ్​ఇండియా.. బంగ్లాదేశ్​పై ఓడిన సంగతి తెలిసిందే. కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, సిరాజ్‌ తదితరులు లేకుండా బరిలోకి దిగిన రోహిత్‌ సేన.. 6 పరుగుల స్వల్ప తేడాతో పరాజయాన్ని అందుకుంది. దీంతో గురువారం జరగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయలేం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

South Africa vs Netherlands World Cup 2023 : ప్రపంచకప్​లో మరో సంచలనం.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

ODI World Cup 2023 : 'భారత్‌ను ఓడించడం కత్తిమీద సామే.. కానీ రోహిత్​ ఉంటే మాత్రం..'

Last Updated : Oct 18, 2023, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.